Gold and Silver Rates Today : రేటు తగ్గితే బంగారం కొనుక్కుందామని చూసే వారికి నిరాశే కనిపిస్తోంది. బంగారం, వెండి రేట్లు రోజు రోజుకీ భారీగా పెరుగుతున్నాయి. రికార్డు హైయెస్ట్ ధరల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.296 పెరిగింది. దీంతో దీని ధర నేడు రూ.74,651కు చేరుకుంది.
చదవండి : దిల్లీ-వారణాసి విమానానికి బాంబు బెదిరింపులు.. ప్రయాణికుల్ని దించేసిన ఇండిగో
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.74,651గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవి. తర్వాత మారుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి. అలాగే నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా పే చేయాల్సి ఉంటుందని గమనించుకోవాలి.
చదవండి : సరికొత్త వెర్షన్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా.. ఇండియాలోనే తొలిసారి!
ఇక దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) మంగళవారం భారీగా పెరిగింది. ఒక్కరోజే ఏకంగా రూ.2,976 పెరిగింది. అంటే దాదాపుగా మూడు వేల రూపాయలు. దీంతో నేడు దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.96,006కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ ఇదే ధర కొనసాగుతోంది. బంగారం, వెండి రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి పెరగడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు సైతం భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం ఆరు డాలర్లు పెరిగి ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2,345కు చేరుకుంది. అలాగే ఔన్సు వెండి ధర 31.80 డాలర్లుగా ఉంది.

