Gold Rates Today : స్థిరంగా వెండి, బంగారం ధరలు

దేశ వ్యాప్తంగా వెండి, బంగారం ధరలు శుక్రవారం దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. ఏది ఎంత ధర ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.

  • Written By:
  • Publish Date - April 26, 2024 / 01:21 PM IST

Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర శుక్రవారం దాదాపుగా స్థిరంగా ఉంది. రూ.72 పెరిగి రూ.74,451కి చేరుకుంది.

చదవండి : రెండో విడత అభ్యర్థుల్లో అత్యంత సంపన్న అభ్యర్థి ఎవరంటే..?

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.74,451గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్‌ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.

చదవండి :  ఓటేసేందుకు లైన్లో నిలబడిన మిస్టర్‌ కూల్‌

దేశీయ మార్కెట్లలో వెండి ధర(Silver Rate) సైతం దాదాపు స్థిరంగా ఉంది. రూ.11 మాత్రం తగ్గి రూ.83,649 వద్ద కిలో వెండి ధర కొనసాగుతోంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్‌ ప్రారంభ సమయానికి దాదాపుగా స్థిరంగా ఉండి స్వల్పంగా తగ్గడం గమనార్హం.

ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ ధరలు సైతం స్థిరంగానే ఉన్నాయి. ఆరు డాలర్ల మేర తగ్గి 2333 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి ధర ప్రస్తుతం 27.47 డాలర్లుగా ఉంది.

Related News

Gold Rates Today : ఆకాశాన్నంటుతున్న బంగారం.. ఒక్క రోజే రూ.4వేల పెరిగిన వెండి!

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దేశీయ మార్కెట్లో శనివారం వెండి, బంగారం ధరలు రెండూ కూడా భారీగా పెరిగాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.