Gold Rates Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
వారం ప్రారంభంలో కాస్త తగ్గి ఊరించిన బంగారం, వెండి ధరలు మంగళవారం మళ్లీ భారీగా పెరిగాయి. ఒక్కరోజే అరవెయ్యికి పైగా పెరగడం గమనార్హం. ఏ లోహం ఎంత ధర ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర సోమవారం రూ.67,175 ఉండగా, మంగళవారం నాటికి రూ.508 పెరిగి రూ.67,683కి చేరింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.67,683గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) సోమవారం రూ.75,853 ఉండగా, మంగళవారం నాటికి రూ.759 పెరిగి రూ.76,612కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి రూ.500 పైనే పెరగడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలూ పెరిగాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2147 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 13 డాలర్లు పెరిగి 2160 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి ధర ప్రస్తుతం 25.12 డాలర్లుగా ఉంది.