»Deepak Nitrite Gave Rs 6 5 Lakh On An Investment Of Rs 10000 Multibagger Stock Turns Investors Fortune
Multibagger Stock: రూ. 10,000 పెట్టుబడి మీద రూ. 6.5 లక్షల రాబడి.. భారీ లాభాలను తెచ్చి పెట్టిన స్టాక్
గత దశాబ్దంలో స్టాక్ మార్కెట్‌ను శాసించిన కంపెనీలలో ఒకటి దీపక్ నైట్రేట్ షేర్. గత 10 ఏళ్లలో కంపెనీ షేర్ల ధరలు 6500 శాతం పెరిగాయి. దీపక్ నైట్రేట్‌లో 10 సంవత్సరాల క్రితం ఇన్వెస్టర్ రూ.10,000 పెట్టుబడి పెడితే, అతని డబ్బు ఈపాటికి రూ.6.5 లక్షలకు పెరిగింది.
Multibagger Stock: గత దశాబ్దంలో స్టాక్ మార్కెట్‌ను శాసించిన కంపెనీలలో ఒకటి దీపక్ నైట్రేట్ షేర్. గత 10 ఏళ్లలో కంపెనీ షేర్ల ధరలు 6500 శాతం పెరిగాయి. దీపక్ నైట్రేట్‌లో 10 సంవత్సరాల క్రితం ఇన్వెస్టర్ రూ.10,000 పెట్టుబడి పెడితే, అతని డబ్బు ఈపాటికి రూ.6.5 లక్షలకు పెరిగింది. శుక్రవారం కంపెనీ ఒక్క షేరు ధర రూ.2083గా ఉంది. గత 5 సంవత్సరాలలో దీపక్ నైట్రేట్ షేర్ ధరలు 623 శాతం పెరిగాయి. 3 సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌ను కొనుగోలు చేసి కలిగి ఉన్న పెట్టుబడిదారులు ఇప్పటివరకు 374 శాతం వరకు లాభాన్ని ఆర్జించారు. ఈ రంగంలో కంపెనీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో కోణం నుండి కూడా కంపెనీ చాలా బాగుంది.
ఎల్ఐసీ వాటా 8.12శాతం
కంపెనీ ప్రస్తుత షేర్ హోల్డింగ్స్ ప్రకారం.. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 50.87 శాతం. ప్రమోటర్లతో సహా ఇతరుల భాగస్వామ్యం 49.13 శాతం. పబ్లిక్ హోల్డర్లలో, మ్యూచువల్ ఫండ్స్ వాటా 8.58 శాతం. విదేశీ పెట్టుబడిదారుల వాటా 6.27 శాతం. కంపెనీలో ఎల్ఐసి వాటా 8.12 శాతం. బీమా కంపెనీ అతిపెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడిదారు.
త్రైమాసిక ఫలితాలు ఎలా ఉన్నాయి?
జూన్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.1800 కోట్లు. ఇది వార్షిక ప్రాతిపదికన 13 శాతం తక్కువ. గత 6 నెలల్లో, దీపక్ నైట్రేట్ షేర్లు 12 శాతం కంటే ఎక్కువ పెరిగాయి.