»Hero Surya Upcomming Project Sudha Kongara Direction In This Movie Surya Looks Like College Student
Surya: కాలేజీ కుర్రాడి లుక్‌లో కనిపించనున్న హీరో సూర్య!
లేడీ డైరక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య అప్‌కమింగ్ ఫిల్మ్ రానుంది. ఈ సినిమాలో సూర్య కాలేజీ కుర్రాడిలా కనిపించనున్నాడని సమాచారం. అంతేకాదు అందుకోసం ఇప్పటి నుంచి వర్క్ అవుట్ చేస్తున్నట్లు తెలిసింది.
Surya: తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ..కొత్త పాత్రలను చేసి స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. తమిళంతో పాటు తెలుగులో తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం సూర్య తన పాన్ ఇండియా సినిమా ‘కంగువా’ షుటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సూర్య లేడీ డైరక్టర్ సుధా కొంగరతో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే చివరి దశకు వచ్చాయి.
తాజాగా ఈ మూవీ నుంచి ఒక న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సూర్య కొంత సమయం కాలేజీ కుర్రాడిలా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందులో అచ్చం 25 ఏళ్ల కాలేజీ కుర్రాడిలా కనిపించే లుక్ కోసం ఇప్పటి నుంచే కసరత్తలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సూర్య ఈ మూవీని సొంత బ్యానర్‌పై నిర్మించనున్నాడు. ఇందులో దుల్కర్ సల్మాన్ ఓ కీలకపాత్ర చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.