»Asian Paints Co Founder Ashwin Dani Passes Away At Age Of 79 Years
Asian Paints : ఏషియన్ పెయింట్స్ ఫౌండర్ అశ్విన్ డానీ కన్నుమూత
దేశంలోనే అతిపెద్ద పెయింట్స్ తయారీ సంస్థ ఏషియన్ పెయింట్స్ సహ వ్యవస్థాపకుడు 79 ఏళ్ల అశ్విన్ డానీ కన్నుమూశారు. అతను ఏషియన్ పెయింట్స్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని నిర్వహించాడు. కంపెనీ బోర్డు సభ్యుడు కూడా. ఏషియన్ పెయింట్స్‌లో అతని ప్రయాణం 1968లో ప్రారంభమైంది.
Asian Paints : దేశంలోనే అతిపెద్ద పెయింట్స్ తయారీ సంస్థ ఏషియన్ పెయింట్స్ సహ వ్యవస్థాపకుడు 79 ఏళ్ల అశ్విన్ డానీ కన్నుమూశారు. అతను ఏషియన్ పెయింట్స్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని నిర్వహించాడు. కంపెనీ బోర్డు సభ్యుడు కూడా. ఏషియన్ పెయింట్స్‌లో అతని ప్రయాణం 1968లో ప్రారంభమైంది. తరువాత సంవత్సరాల్లో కంపెనీకి కూడా నాయకత్వం వహించాడు. ఏషియన్ పెయింట్స్ నేడు భారతదేశంలో అతిపెద్ద పెయింట్స్ కంపెనీగా ఉంది. అశ్విన్ డాని దానిలో పెద్ద సహకారం అందించారు. ఫోర్బ్స్ డేటా ప్రకారం 2023లో అశ్విన్ డాని నికర విలువ 7.1 బిలియన్ డాలర్లు.
అశ్విన్ డాని 1944 సెప్టెంబర్ 26న ముంబైలో జన్మించాడు. 1966లో ముంబై యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో బీఎస్సీ పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికా (USA) వెళ్లి అక్కడ అక్రోన్ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అతను రసాయన శాస్త్రవేత్తగా డెట్రాయిట్లో తన వృత్తిని ప్రారంభించాడు. 1968లో అతను తన కుటుంబ వ్యాపారమైన ఏషియన్ పెయింట్స్‌లో చేరాడు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏషియన్ పెయింట్స్ ఆదాయం రూ. 34,488 కోట్లు, దానిపై కంపెనీ రూ. 4101 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. నేడు ఏషియన్ పెయింట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.303,341 కోట్లు. గురువారం ట్రేడింగ్ సెషన్లో ఏషియన్ పెయింట్స్ షేరు 4.21 శాతం క్షీణతతో రూ.3162 వద్ద ట్రేడవుతోంది.
ఏషియన్ పెయింట్స్ 1942లో ప్రారంభమైంది. నలుగురు స్నేహితులు కలిసి ఏషియన్ పెయింట్స్ కంపెనీని ప్రారంభించారు. 967 నాటికి కంపెనీ దేశంలోనే అతిపెద్ద పెయింట్స్ కంపెనీగా అవతరించింది. నేడు ఏషియన్ పెయింట్స్ ప్రపంచంలోని టాప్ 10 పెయింట్స్ కంపెనీలలో స్థానం పొందింది. కంపెనీ ఆసియాలో రెండవ స్థానంలో, ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఏషియన్ పెయింట్స్ 15 దేశాల నుండి పనిచేస్తోంది. 60 దేశాలలో ఉనికిని కలిగి ఉంది. కంపెనీకి 27 తయారీ కేంద్రాలు ఉన్నాయి.