Amazon axe turns to India as part of global workforce reductions
Amazon: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో (Amazon) ఉద్యోగాల కోత మొదలైంది. గత మార్చి నెలలో 9 వేల మంది ఉద్యోగుల తొలగిస్తామని సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇండియాలో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ (Amazon) 9 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఇండియాలో తొలగించే వారిని గురించిన సంస్థ పింక్ స్లిప్‌లు జారీ చేస్తోంది. తొలగింపుకు గురవుతున్నవారిలో ఎక్కువ మంది వెబ్ సర్వీసెస్, హెచ్ఆర్ టీమ్‌లోని ఉద్యోగులు, పీపుల్ ఎక్స్పిరియన్స్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్(పీఎక్స్‌టీ)కి చెందిన వారు ఉన్నారు.
ఇండి యాలో (india) పని చేస్తున్న వారిలో 500 మంది వరకు లేఆఫ్‌లకు గురవుతారని అంచనా. ఇప్పటికే పీఎక్స్టీకి చెందిన వంద మందికి పింక్ స్లిప్‌లు అందించారని కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి తెలిపారు. వెబ్ సర్వీసెస్ నుంచి ఇప్పటి వరకు 80 మందికి పింక్ స్లిప్‌లు అందించారని తెల్సింది.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) విభాగంలో లేఆఫ్‌లు నార్త్ అమెరికా నుంచి ప్రారంభమైనట్లు ఏడబ్ల్యూఎస్ సీఈఓ ఆడమ్ సెలిప్స్కీ తెలిపారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ విభాగం ఉద్యోగుల నుంచి తొలగించే వారిని గుర్తిస్తున్నట్లు చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా వెబ్ సర్వీసెస్‌లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీరిలో చాలా మంది తొలగించాల్సి వస్తోందన్నారు.