ప్రపంచ కుబేరుడు, భారత వ్యాపారవేత్త అయిన గౌతమ్ అదానీ ఆస్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తి అయిన అదానీ తాజాగా బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 21వ స్థానానికి పడిపోయాడు. గత రెండు వారాలుగా గౌతమ్ అదానీ కంపెనీ షేర్లలో నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యనే భారతదేశపు బడా వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ ఇండియాలో అత్యంత ధనవంతుడయ్యాడు. ఆస్తుల పరంగా చూస్తే అదానీ వెనకంజలో ఉన్నాడు.
బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారంగా చూస్తే అంబానీ మొత్తం నికర ఆస్తుల విలువ 82.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం గౌతమ్ అదానీ మొత్తం నికర విలువ 61.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో బెర్నాల్ట్ ఆర్నాల్ట్ సంస్థ నికర విలువ 217.5 బిలియన్ డాలర్లు ఉండగా రెండో స్థానంలో ఎలాన్ మస్క్ 183.2 బిలియన్ డాలర్లతో కొనసాగుతున్నారు. ఇక మూడో స్థానంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 136 బిలియన్ డాలర్లతో కొనసాగుతున్నాడు.