పసిడి ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్ (ETF)లోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా తెలిపింది. అక్టోబరులో రూ.1,961 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెప్పింది. పండగలు, పెళ్లిళ్ల సీజన్లో పసిడి ధరలు పెరగవచ్చన్న అంచనాలు పెట్టుబడుల పెరుగుదలకు కారణమయ్యాయి. ఈ పెట్టుబడులు సెప్టెంబర్‌తో పోల్చితే 59% ఎక్కువ. పసిడి ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు 12% పెరిగి రూ.44,545 కోట్లకు చేరాయి.