ప్రకాశం: గిద్దలూరు – నంద్యాల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల నుంచి గిద్దలూరు వైపు బయల్దేరిన బోర్‌వెల్స్ లారీ చలమ రైల్వే స్టేషన్ సమీపంలోని దొరబావి వద్దకు వచ్చేసరికి అదపు తప్పింది. మోరీని ఢీకొని లోయలో పడింది. డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. నంద్యాల నుంచి వచ్చిన 2 క్రేన్స్ ద్వారా లారీని వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు.