ప్రకాశం: చీమకుర్తి మండలంలోని చీమలమర్రి దగ్గర శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.