T-SAVE అంటూ విపక్షాలకు షర్మిల పిలుపు, కోదండరాం అధ్యక్షుడిగా ఉండాలంటూ..
టీ-సేవ్ అనే సంస్థ ఏర్పాటు చేద్దామని విపక్షాలను షర్మిల కోరారు. ఇందులో అన్నీ పార్టీలకు సమాన అవకాశాలు ఉంటాయని చెప్పారు. కోదండరాం అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని చెప్పారు.
YS Sharmila call to T-SAVE:విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (YS Sharmila) బిజీగా ఉన్నారు. ఇటీవల టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (revanth reddy) ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు బండి సంజయ్‌కు (bandi sanjay) కూడా కాల్ చేశారు. ఇప్పుడు టీ-సేవ్ అనే సంస్థ ఏర్పాటు చేద్దామని కోరుతున్నారు.
యువత కోసం రాజకీయాలు పక్కన బెట్టి ప్రతిపక్షాలు ఏకం కావాలని ఆమె కోరారు. T-SAVE- తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీన్ అండ్ ఎంప్లాయిమెంట్ ఫోరం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. జెండా వేరైనా ఒకే అజెండాతో నిరుద్యోగుల కోసం కలిసి పోరాడదాం అని పిలుపునిచ్చారు. ఇందులో అన్ని పొలిటికల్ పార్టీలు (political parties) ఉంటాయని.. కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. అందరికీ సమాన హక్కులు ఉంటాయని.. ఎవరు నాయకత్వం వహించిన అభ్యంతరం లేదన్నారు.
కోదండరామ్ (kodandaram) అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్న అని తన మనసులోని మాటను షర్మిల (YS Sharmila) బయటపెట్టారు. కోదండరామ్ గతంలో ఎన్నో ఉద్యమాలను లీడ్ చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇతర వ్యక్తులను ఎవరిని పెట్టినా పర్లేదు అని చెప్పారు. అధ్యక్షుడికి సంబంధించి ఏప్రిల్ 10వ తేదీన సమావేశమై నిర్ణయం తీసుకుందామని సూచించారు.
ప్రగతి భవన్ (pragati bhavan) ముందు ధర్నా చేయడానికి అనుమతి వస్తుందని చెప్పారు. సీబీఐ (cbi) విచారణ కూడా జరుగుతుంది. కాంగ్రెస్, బీజేపీ రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షలుు ఒకరు ఉంటే మరొకరు రామని అంటున్నారని గుర్తుచేశారు. కాళేశ్వరం మీద అవినీతి మీద విచారణ చేయాలని బీజేపీని ఎందుకు డిమాండ్ చేయలేదని రేవంత్‌ను షర్మిల సూటిగా అడిగారు.
లిక్కర్ స్కాం (liquor scam) విషయంలో కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బీజేపి అడగొచ్చు కదా అని షర్మిల అన్నారు. జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో హోం మంత్రి మనవడు, మిత్రపక్షం ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని ఆ కేసు నీరుగార్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో 55 లక్షల మంది యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారని షర్మిల చెప్పారు. పాలకులు ఈ నిరుద్యోగ సమస్య ముందే గుర్తించి ఉంటే ఇంత పెద్ద సమస్య అయ్యేది కాదన్నారు.
ఎకరానికి కోటి రూపాయలు సంపాదించే కేసీఆర్.. రాష్ట్రంలో మిగతా రైతులు అంతే సంపాదించాలి కదా అని అడిగారు. రైతుల ఆత్మహత్యలు లేవని పచ్చి అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ (kcr) గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 8 వేల రైతులు ఆత్మహత్యలు చేసుకున్న మాట నిజం కాదా అని అడిగారు. రైతుల పాలిట కేసీఆర్ (kcr) రాక్షసుడు. ద్రోహి అని విమర్శించారు.