నేడు(జూన్ 18న) వరల్డ్ ఫాదర్స్ డే. ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ మూడో ఆదివారం రోజున జరుపుకుంటారు. అయితే ఈసారి కూడా మన ఫాదర్ కు విషెస్ తెలియజేసి సంతోషంగా గడిపేద్దాం.
ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే వేడుకలను చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజు మన జీవితంలో తండ్రులను గౌరవించే ముఖ్యమైన రోజు. మనల్ని పెంచేందుకు తండ్రి పడే కష్టం, తాను చేసే త్యాగాలను గౌరవిస్తూ తండ్రికి విషెస్ తెలియజేస్తారు. నిజ జీవితంలో మన కలలను సాకారం చేసుకోవడానికి ఎల్లప్పుడూ అండగా ఉంటూ సపోర్ట్ చేసే వ్యక్తి నాన్న. అలాంటి వ్యక్తికి ఎంత చేసినా ఏం చేసినా కూడా తక్కువే. కుటుంబం కోసం తాను నిత్యం కష్టపడుతూ బయటకు మాత్రం చాలా సాదాసీదాగా కనిపిస్తారు. తన పిల్లల జీవనం కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడే ఏకైక వ్యక్తి ఒక్క తండ్రి మాత్రమే. అలాంటి తండ్రిని ఈరోజే కాదు. ప్రతిరోజు గౌరవిద్దాం. తాను పడుతున్న కష్టాన్ని గుర్తించి నాన్నతో ఆప్యాయంగా మాట్లాడి సంతోషంగా గడుపుదాం.
నా మంచి, చెడు, ఆనందం, విజయం..అన్నింటికీ కారణం మీరే నాన్న
– హ్యాపీ ఫాదర్స్ డే
అల్లారు ముద్దుగా పెంచేది నాన్న..
మనకు గమ్యం చూపేది నాన్న..
అనురాగానికి రూపం నాన్న..
– హ్యాపీ ఫాదర్స్ డే
మన బాగుకోసం, భవిత కోసం, ఆరాటపడేది నాన్న
చేసే ప్రయాణం ఆపొద్దని చెప్పే తొలి గురువు నాన్న
– హ్యపీ ఫాదర్స్ డే
సోనోరా లూయిస్ స్మార్ట్ డాడ్ 1882లో జన్మించారు. ఆమె అమెరికన్ సివిల్ వార్ వెటరన్ విలియం జాక్సన్ స్మార్ట్ కుమార్తె. ఆమె 16 సంవత్సరాల వయస్సులో ఆమె తల్లి మరణించింది. ఆమె తండ్రి ఆమెను ఆమె ఐదుగురు సోదరులను పెంచారు. ఒకరోజు చర్చిలో మదర్స్ డే గురించి ప్రసంగం వింటున్నప్పుడు, ఫాదర్స్ డేని కూడా జరుపుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తండ్రులను గౌరవించేలా తన తండ్రి పుట్టినరోజు జూన్ 5ని ఫాదర్స్ డేగా జరుపుకోవాలనే ఆలోచనతో సోనోరా ముందుకు సాగింది. ఈ వేడుక వాషింగ్టన్ రాష్ట్రం అంతటా వ్యాపించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వెంటనే, దేశం మొత్తం వ్యాపించింది.
మరో ఘటనలో U.S. చరిత్రలో అత్యంత ఘోరమైన మైనింగ్ ప్రమాదంలో వందలాది మంది పురుషులు మరణించిన తర్వాత మొదటిసారి జూలై 5, 1908న వెస్ట్ వర్జీనియాలోని ఫెయిర్మాంట్లో మొట్టమొదటి ఫాదర్స్ డేను నిర్వహించారు. వారి సేవలకు గుర్తుగా రెవరెండ్ కుమార్తె గ్రేస్ గోల్డెన్ క్లేటన్ ప్రయత్నాల కారణంగా ఆదివారం రోజున జరిపారు. ఆ తర్వాత క్రమంలో అనేక దేశాల్లో జూన్ మూడో ఆదివారం రోజున ఫాదర్స్ డేను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఫాదర్స్ డేను ప్రపంచవ్యాప్తంగా జూన్ 18న ఇండియాతోపాటు, యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, అర్జెంటీనా, కెనడా, ఫ్రాన్స్, గ్రీస్, ఇండియా, ఐర్లాండ్, మెక్సికో, పాకిస్తాన్, సింగపూర్, ఆఫ్రికా వంటి పలు దేశాల్లో కూడా జరుపుకుంటారు.