మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఈ నెల 10వ తేది నుంచి ప్రారంభం కానుంది. ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీని ఐసీసీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించనుంది. అలాగే ఇండియాలో కూడా ఈ నెల 12వ తేది నుంచి మ్యాచులు జరుగుతాయి. తొలి మ్యాచ్ పాకిస్థాన్ తో ఉంది. ఇండియా తన దాయాదీ దేశం పాక్ తో తలపడనుంది. ఇటీవల ఐసీసీ మొదటిసారి అండర్19 మహిళా టీ20 ప్రపంచ కప్ నిర్వహించింది. అందులో టీమిండియా వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. ఈ విజయాన్ని మరువక ముందే భారత మహిళా జాట్టు మరో టీ20 పోరుకు సిద్ధమవుతోంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. వాటిని ఐసీసీ రెండు గ్రూపులుగా విభజించింది.
గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. అలాగే గ్రూప్-బిలో ఇంగ్లండ్, భారత్, పాకిస్థాన్, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూపులో కూడా మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్ కు చేరనున్నాయి. ఫిబ్రవరి 26వ తేది ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ ఉండనుంది. టీ20 మహిళా వరల్డ్ కప్ నేపథ్యంలో భారత జట్టును బీసీసీ వెల్లడించింది. హర్మన్ ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, అంజలి శర్వాణి, పూజ వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే జట్టులో ఉన్నారు.