తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. పలు విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు సాగర్ (70) మృతి చెందారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం 6 గంటలకు కన్నుమూశారు. ఎంతో మంది యువ దర్శకులుగా సాగర్ గురువుగా గుర్తింపు పొందారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి:తారకరత్న ఆరోగ్యం మెరుగైంది.. త్వరలో సినిమా చేస్తాం
ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన సాగర్ చైన్నైలో స్థిరపడ్డారు. 1983లో నరేశ్-విజయశాంతి నటించిన ‘రాకాసి లోయ’ సినిమాతో దర్శకుడిగా పరిశ్రమలోకి వచ్చారు. అనంతరం కృష్ణతో తీసిన ‘అమ్మదొంగ’ మంచి విజయం సాధించింది. ఇక స్టూవర్ట్ పురం దొంగలు, ఓసి నా మరదలా, ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నంబర్, రామసక్కనోడు 1 తదితర 40 సినిమాలకు దర్శకత్వం వహించారు. రామసక్కనోడు సినిమాకు మూడు నంది అవార్డులు లభించడం విశేషం. తెలుగు సినిమా దర్శకుల సంఘానికి సాగర్ మూడుసార్లు అధ్యక్షుడిగా పని చేశారు. శ్రీను వైట్ల, వీవీ వినాయక్, రవి కుమార్ చౌదరి తదితర ఎంతో మంది దర్శకులకు సాగర్ గురువులాంటి వారు.