»Waste Of Public Money No Use With New Secretariat Kishan Reddy
Kishan Reddy: ప్రజాధనం వృథా.. కొత్త సచివాలయంతో ఉపయోగం లేదు
తెలంగాణలో నూతన సచివాలయం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy) అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని వల్ల ప్రజా ధనం వృథా తప్ప మరేం లేదని అన్నారు. మరోవైపు కేసీఆర్ వాస్తు నమ్మకాలతో పాత సచివాలయ భవనాన్ని కూల్చివేశారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. ఈ క్రమంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో అవి మాత్రం అమలు కావడం లేదన్నారు. అంతేకాదు ప్రజలకు ఎంట్రీ లేని ఈ భవనం ఎందుకని ప్రశ్నించారు. మరోవైపు పలు మీడియా ఛానెళ్లకు ఈ భవనంలోకి ఎందుకు ఎంట్రీ ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కొత్త సచివాలయం కారణంగా కేసీఆర్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పాత సచివాలయ భవనం ముఖ్యమంత్రులకు దురదృష్టం తెచ్చిపెట్టిందని కేసీఆర్(KCR)కు వాస్తు పిచ్చి పట్టిందని అన్నారు. ఆ క్రమంలోనే పాత భవనంలో పని చేసేందుకు కేసీఆర్ నిరాకరించినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో కొత్త సచివాలయం జూన్ 27న రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేసి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. దీని వల్ల ఎవరికి ఉపయోగమో కేసీఆర్ చెప్పాలని కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రశ్నించారు. అంతేకాదు ఈ నిర్మాణంలో కోట్ల రూపాయల కమిషన్ కూడా దండుకున్నట్లు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చూడండి:Telangana New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయం చిత్రాలు
సచివాలయం విశేషాలు ఇప్పుడు చుద్దాం
చెన్నైకి చెందిన వాస్తుశిల్పులు పొన్నీ కాన్సెసావో, ఆస్కార్ కాన్సెసావో రూపొందించిన కొత్త సెక్రటేరియట్ ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇండో-ఇస్లామిక్ నిర్మాణ లక్షణాలు, గోపురాలతో మిళితం చేసే ఇండో-సార్సెనిక్ శైలిలో కనిపిస్తుంది. భవనం గోపురాలు, తోరణాలు సింక్రెటిక్, లిబరల్ డెక్కన్ శైలిని సూచించే ఈ శైలిలో ఉంటాయి.
కాన్ఫరెన్స్ హాల్స్, విజిటర్స్ లాంజ్‌లు, డైనింగ్ హాల్స్, ఇతరత్రా అన్ని ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడింది. సచివాలయ భవనం మొత్తం 8,58,530 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది ఒక గ్రౌండ్ ఫ్లోర్, లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ తో ఆరు అంతస్తులను కలిగి ఉంది.
తెలంగాణ కొత్త సచివాలయ సముదాయం మొత్తం 27.9 ఎకరాల్లో విస్తరించి ఉంది. భవనం 2.45 ఎకరాలు, ల్యాండ్‌స్కేపింగ్ 7.72 ఎకరాలు. సెంట్రల్ యార్డ్ లాన్ 2.2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సచివాలయంలో 560 కార్లు, 700 ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలం ఉంది.
ఈ నిర్మాణం కోసం 12,000 మందికి పైగా కార్మికులు మూడు షిఫ్టులలో పనిచేశారు. సుమారు 7,000 టన్నుల స్టీల్, 35,000 టన్నుల సిమెంట్, 26,000 టన్నుల ఇసుక, 1 లక్ష చదరపు అడుగుల మార్బుల్, 3 లక్షల చదరపు అడుగుల గ్రానైట్, 60,00 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 11 లక్షల కాంక్రీటును కొత్త సచివాలయ నిర్మాణానికి ఉపయోగించారు.
ఈ కొత్త కాంప్లెక్స్‌ని ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పుట్టినరోజున ప్రారంభించాల్సి ఉంది. పలు కారణాలతో ఏప్రిల్ 30కి వాయిదా పడింది.
ఇది కూడా చూడండి:Telangana New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయం చిత్రాలు