Vyavastha: వ్యవస్థ ట్రైలర్ రిలీజ్ చేసిన డీజే స్టార్ సిద్దు
వ్యవస్థ(vyavastha) వెబ్ సిరీస్ ట్రైలర్‌ను డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ చేతుల మీదుగా జీ5(ZEE5 Original) గురువారం విడుదల చేసింది. ఈ చిత్రంలో కార్తీక్ రత్నం, సంపత్ రాజ్, హెబ్బా పటేల్, కామ్నా జెఠ్మలానీ కీలక పాత్రల్లో నటించారు. ఈ కోర్టు థ్రిల్లింగ్ కోర్టు డ్రామా ఏప్రిల్ 28న స్ట్రీమింగ్ కానుంది.
వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్యమం జీ 5(ZEE5 Original). త్వరలోనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కట్టి పడేసే కోర్టు రూమ్ డ్రామా ఈ లిస్టులో చేరనుంది. అదే ‘వ్యవస్థ’(vyavastha). జీ 5లో ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్‌ను ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగ తెరకెక్కించారు. ఆయన జీ 5లో వచ్చి ‘షూట్ ఔట్ ఎట్ అలేర్’ సిరీస్‌ను తెరకెక్కించారు. కార్తీక్ రత్నం, సంపత్ రాజ్, హెబ్బా పటేల్, కామ్నా జెఠ్మలానీ ఇందులో ప్రధాన పాత్రధారులుగా యాక్ట్ చేశారు.
ట్రైలర్ ఈరోజు న్యాయం రేపటి క్రైమ్ అయితే, నేటి క్రైమ్ రేపటి చట్టం అవుతుందని ఓ లా కోర్సు ట్రైనర్ తన స్టూడెంట్స్‌కు చెప్పటంతో స్టార్ట్ అవుతుంది. సంపత్ రాజ్ ఇందులో చక్రవర్తి అనే చాలా పవర్ఫుల్ పాత్రలో చేసినట్లు తెలుస్తుంది. సిటీలోని లాయర్స్ అందరూ తన జూనియర్స్‌గా నియమించుకుని వారిపై అజమాయిషీ సంపాదించటం ద్వారా తాను చెప్పిందే జరగాలనుకునే వ్యక్తిగా కనిపిస్తారు.
యువ నటుడు కార్తీక్ రత్నం ఇందులో కొన్ని నియమ నిబంధనలకు లోబడి పని చేసే మంచి మనసున్న జూనియర్ లాయర్ వంశీ పాత్రను పోషించారు. తాను నత్తి సమస్యతో బాధపడుతుంటాడు. దీని వల్ల తనని తాను తక్కువగా ఊహించుకుంటుంటాడు. అయితే తను హత్యా నేరం మోపబడిన యామిని అనే అమ్మాయిని కాపాడాలని తాపత్రయపడుతుంటాడు. ఈ క్రమంలో సిటీలోనే అతి పెద్ద లాయర్‌గా పేరు తెచ్చుకున్న చక్రవర్తితో తలపడాల్సి వస్తుంది. సమాజంలో ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి యామినిని కాపాడటానికి ఆమెకు అండగా నిలబడతాడు.
ఇందులో యామిని పాత్రను హెబ్బా పటేల్ పోషించింది. తన పాత్ర అసాధారణంగా ఉండబోతుందనటంలో సందేహం లేదు. అది ట్రైలర్లో స్పష్టంగా తెలుస్తుంది. గాయత్రి అనే పాత్రలో కామ్నా జెఠ్మలానీ కనిపించనుంది. లా కాలేజ్‌లోనూ కొంత కథ నడుస్తుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు తెలియని ఆసక్తిని పెంచే థ్రిల్లింగ్ సన్నివేశాలన్నీ ఈ ఒరిజినల్లో ఉండబోతున్నాయి. ఏప్రిల్ 28 నుంచి వ్యవస్థ ఒరిజినల్ జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.