మేషం : శనివారం రోజు సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం చేసినా విజయం సాధించే అవకాశం ఉంది. అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభం ఉంటుంది. ఆరోగ్యం ఇబ్బంది పెట్టదు.
వృషభం : ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే ప్రయత్నాలు మొదలవుతాయి. అదనపు ఆదాయం వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగంలో మీకు మంచి జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. విహారయాత్ర చేస్తారు. జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత పెరిగి ఆనందంగా ఉంటారు.
మిథునం : ఉద్యోగంలో ఆశించినంత ప్రోత్సాహం వస్తుంది. తోటి వారి నుంచి ఆదరాభిమానాలు పొందుతారు. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ముఖ్యమైన అవసరాలపై ఖర్చు చేస్తారు. ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
కర్కాటకం : ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రాదనుకున్న డబ్బు తిరిగి వస్తుంది. ఆచితూచి ఖర్చు చేయండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి అనేది ఉంటుంది. పని భారం పెరుగుతుంది. డాక్టర్లకు, లాయర్లకు, ఇతర వృత్తి నిపుణులకు క్షణం కూడా తీరిక ఉండదు. కుటుంబ సభ్యులలో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు.
సింహం : ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. అపార్ధాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. పెళ్లి సంబంధాలు ఫలితాలనిస్తాయి. రావలసిన డబ్బులు చేతికి సకాలంలో అందుతాయి. ఆరోగ్య సమస్యలు రావు. వృత్తి, వ్యాపారాలలో సంపాదన మెరుగవుతుంది.
కన్య : వృత్తి, ఉద్యోగాలు పర్వాలేదు. వ్యాపారాలు మెరుగ్గా సాగుతాయి. ఆదాయం బాగానే వస్తుంది. కుటుంబంలో కొద్దిగా కలతలు కలహాలు వస్తాయి. జీవిత భాగస్వామితో వాదాలకు దిగుతారు. అనారోగ్యంతో ఇబ్బంది పడతారు.
తుల : ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు కూడా తొలగుతాయి. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులకు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బావుంటుంది. వృత్తి ఉద్యోగాలు సాఫీగా ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది.
వృశ్చికం : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇతరులకు సాయం చేస్తారు. మీ సలహాలు, సూచనలు అధికారులు వింటారు. ఆరోగ్యం బావుంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. వృత్తి వ్యాపారాలు బాగానే ఉంటాయి.
ధనుస్సు : ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఇతరులకు మంచి చేస్తారు. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. సంపాదన పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.
మకరం : వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయపరంగా చిన్నపాటి అదృష్టం కలిసి వస్తుంది. శుభవార్తలు వింటారు.
కుంభం : వృత్తి, ఉద్యోగాలలో శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఆదాయం పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండాలి. ఆహార విషయాల్లో జాగ్రత్త పాటించాలి. వాగ్దానాలు, హామీలు వంటివి చేయకండి.
మీనం : కుటుంబంలో సంతోషం అంతగా ఉండదు. ఉద్యోగ పరంగా ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. ఉద్యోగంలో తోటివారి నుంచి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆదాయం అంతగా ఉండదు. అప్పులు ఎక్కువవుతాయి. మనసు ప్రశాంతంగా ఉండదు. అప్పులు వెంటాడుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగవు. గుడికి వెళ్లాలని ఉన్నా వాయిదా వేస్తారు. భార్యల నుంచి భర్తలకు ప్రమాదం ఉంది. సంసార జీవితం సంతోషంగా ఉండదు. వీరు మౌనంగా ఉండటం మంచిది. దేవున్ని ప్రార్థిస్తూ ఉంటే కాస్త ఉపశమనం పొందొచ్చు.