కేంద్ర బడ్జెట్లో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు తగ్గించారని విమర్శించారు. ఎత్తును కూడా తగ్గించారన్నారు. ఉత్తరాంధ్రకు సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా సాగు తాగునీరు అందించాలంటే ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల ఎత్తు ఉండాలన్నారు.

