మహబూబ్నగర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. 23వ డివిజన్ బీజేపీ అభ్యర్థి ప్రవళికా శ్రీకర్ మద్దతుగా మర్లు ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. 30కి పైగా డివిజన్లు గెలిచి కార్పొరేషన్ కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, కేంద్ర నిధులతోనే పట్టణాభివృద్ధి సాధ్యమని ఆమె పేర్కొన్నారు.

