VZM: బాబామెట్టలో గల ప్రముఖ సూఫీ క్షేత్రం ఖాదర్ బాబా దర్గా, దర్బార్లో గత మూడు రోజులుగా జరుగుతున్న సూఫీ మహనీయులు హుజూర్ హజరత్ బాబా సయ్యద్ ఖాదర్ వలి 67 వ ఉరుసు మహోత్సవాలు నేటితో ఘనంగా ముగిశాయి. ఖలీల్ బాబు పర్యవేక్షణలో జరిగిన ఈ ఉత్సవంలో లక్షకు పైగా భక్త జనం పోటెత్తారు. భక్తులతో పాటు ప్రముఖులు, రాజకీయ నేతలు బాబాను దర్శించుకుని ప్రసాదం స్వీకరించారు.

