కోనసీమ: వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య ఆదివారం హెచ్చరించారు. అంబటి రాంబాబు జాగ్రత్తగా ఉండాలని ఘాటుగా స్పందించారు. గత పాలనలో అబద్ధాలు చెప్పిన వారిని ప్రజలు గుర్తించారని, రెడ్ బుక్ అంటే ఎలా ఉంటుందో త్వరలోనే చూస్తారని పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదన్నారు.

