అనకాపల్లి జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధిగా పాయకరావుపేటకు చెందిన దువ్వు శ్రీనివాస్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం కసింకోర్టులో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆ పదవిలో తనను నియమించినట్లు ఆయన తెలిపారు. యాదవులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

