KMM: చింతకాని మండల పరిధిలోని చిన్నమండవ మున్నేరు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను చింతకాని ఎస్సై వీరేందర్ ఆదివారం తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

