»The Best 5g Phone Under 20 Thousand Oneplus Nord Ce 3 Lite 5g India
OnePlus Nord CE 3 Lite 5G…20 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్!
OnePlus నుంచి 20 వేల రూపాయల్లోపే అదిరిపోయే 5జీ ఫోన్ అందుబాటులోకి వచ్చేస్తుంది. OnePlus సరికొత్త ఫోన్ ఏప్రిల్ 11 నుంచి దాని అధికారిక వెబ్సైట్, Amazon సహా ఇతర రిటైల్ స్టోర్లలో అమ్మకానికి లభ్యం కానుంది. అయితే ఈ పోన్ మోడల్ ఫీచర్లను ఇప్పుడు చుద్దాం.
OnePlus 2023లో ఫుల్ బిజీగా ఉంది. OnePlus 11 5Gని ప్రారంభించిన రెండు నెలల తర్వాత, షెన్జెన్ ఆధారిత తయారీదారు తన బడ్జెట్-స్నేహపూర్వక హ్యాండ్‌సెట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అదే OnePlus Nord CE 3 Lite 5G. అయితే దీని ప్రారంభ ధర రూ.19,999గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఏప్రిల్ 11 నుంటి కంపెనీ అధికారిక వెబ్సైట్, Amazon సహా ఇతర రిటైల్ స్టోర్లలో లభించనుంది. ఈ సందర్భంగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.