విజయ శిఖరాలను తాకిన వారి జీవితాల్లో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో అవరోధాలు నిండి ఉంటాయి. వాటన్నింటిని ఎదుర్కొన్న వారే విజేతలుగా కీర్తించబడుతారు. అలాంటి ఒక అమ్మాయి గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అరోరా స్కై కాస్ట్నర్ (18) అనే యువతి మోంట్గోమెరీ (Montgomery) దేశస్తురాలు. ఈ అమ్మాయి పుట్టుకే జైలులో జరిగింది. (girl born in prison) అరోరా తల్లి గర్భంతో ఉన్నప్పుడు జైలు శిక్ష పడింది. దీంతో అరోరా జైలులోనే జన్మించింది. పుట్టగానే జైలు గోడలను చూసిన అరోరాను ఆమె తండ్రి తీసుకెళ్లి పెంచాడు. చిన్నప్పుడు తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగింది. చిన్నప్పటి నుంచి చదువులో అసక్తిని కనబరిచిన అరోరా పెద్దయ్యాక హార్వర్డ్ యునివర్సిటీలో (Harvard University) చదివేందుకు సీటు సంపాదించింది. ఆమె తన హార్వర్డ్ దరఖాస్తును చదువుతూ.. ‘నేను జైలులో పుట్టాను’ అంటూ తన దరఖాస్తులోని మొదటి లైనును చదువుతూ బావోద్వేగానికి గురైంది.
అరోరా ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ లో నివసిస్తోంది. తన విజయాలన్నింటికీ ముఖ్య కారణం తన గురువు మోనా హంబీ అని చెప్పింది. జీవితంలో ఎన్నో విషయాలను తన గురువు వద్దే నేర్చుకున్నానని తెలిపింది. చిన్నప్పుడు ఎలాంటి పరిస్థితులతో జీవితాన్ని మొదలుపెట్టినా పెద్దవుతున్న క్రమంలో తమ భవిష్యత్తును తామే మార్చుకోవచ్చని అరోరా పేర్కొంది. ప్రతీ ఒక్కరు తమ ఆలోచనలను అభివృద్ధి చేసుకుంటే మంచి భవిష్యత్తును సృష్టించుకోవచ్చని అన్నారు. చిన్నప్పుడు తాను తల్లి ప్రేమకు దూరమవడం తనకెంతో లోటుగా ఉండేదని చెప్పింది. ముఖ్యంగా ఆవిడ తన హార్వర్డ్ అప్లికేషన్ లో మొదటి లైన్ ‘నేను జైలులో జన్మించాను’ అని రాసుకుంది. తనకు చిన్నప్పటి నుంచి తల్లిప్రేమ అంటే తెలియదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె కొంతకాలం క్రితం బోస్టన్ విశ్వవిద్యాలయం ప్రోఫేసర్ తో కలిసి పనిచేసినట్లు చెప్పింది.