ప్రశ్నాపత్రాల లీకేజీలో బండి సంజయ్ పాత్ర ఉందని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా బీజేపీ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు.
ప్రశ్నాపత్రాల లీకేజ్ అంశంలో బండి సంజయ్ (Bandi Sanjay Kumar) పాత్ర ఉందనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేయడంతో తెలంగాణలో (Telangana) రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాగా బీజేపీ కుట్ర రాజకీయాలను బీఆర్ఎస్ (BRS Party) తిప్పి కొడుతోంది. సంజయ్, బీజేపీ నాయకులపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఖండిస్తున్నారు. వారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇదే అంశంపై ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KT Rama Rao) వరుసగా ట్వీట్లు చేశాడు. బీజేపీ, ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్లు వైరల్ గా మారాయి.
బీజేపీ అధికారంలోకి వచ్చాక ధరలు భారీగా పెరుగుతున్నాయని చెబుతూ కేటీఆర్ (KTR) ఓ ఆసక్తికర ట్వీట్ (Tweet) చేశాడు. ‘ఉప్పు పిరం.. పప్పు పిరం.. పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం, గ్యాస్ పిరం.. గ్యాస్ పై వేసిన దోశ పిరం, అన్నీ పిరం.. పిరం…, జనమంతా గరం… గరం. అందుకే అంటున్న ప్రియమైన ప్రధాని.. మోదీ కాదు.. పిరమైన ప్రధాని.. మోదీ’ అంటూ కేటీఆర్ పోస్టు చేశాడు. దానికి పత్రికల్లో ధరల పెంపుపై వచ్చిన కథనాల క్లిప్పింగ్ లను జత చేశాడు. ఇక మరో ట్వీట్ లో సంజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంజయ్ ను పిచ్చోడిగా (Madfellow) అభివర్ణించాడు. ‘పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…!! కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం…!!!
తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ నాయకులు’ అని కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన పోస్టును జత చేశాడు. ప్రశ్నాపత్రాల లీకేజీలో బండి సంజయ్ పాత్ర ఉందని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా బీజేపీ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు.
పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…!!
కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం…!!!
తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు #BJPleakshttps://t.co/8GFI6ups6v