»Rs 425 Crore Worth Of Drugs In Gujarat Coast 2 Crore Worth Of Gold Seized In Nadia Bengal
Seized: గుజరాత్ తీరంలో రూ.425 కోట్ల డ్రగ్స్, నాడియాలో 2 కోట్ల గోల్డ్
ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఎటీఎస్(ATS) అధికారుల సంయుక్త ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్(drugs) పట్టుబడింది. అరేబియా సముద్రంలోని భారత జలాల్లో రూ.425 కోట్ల విలువైన 61 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఐదుగురు సిబ్బందితోపాటు ఇరాన్ బోటును కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఇండియాలోకి భారీగా డ్రగ్స్(drugs) ను తరలించే ముఠాను గుజరాత్ తీరంలో(Gujarat coast) సోమవారం రాత్రి అధికారులు పట్టుకున్నారు(seized). ఈ క్రమంలో వారి నుంచి దాదాపు రూ.425 కోట్ల విలువైన 61 కేజీల డ్రగ్స్(drugs) ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ATS అధికారులు సోమవారం అర్థరాత్రి జరిపిన సోదాల్లో డ్రగ్స్ తోపాటు ఐదుగురు సిబ్బంది, ఇరాన్(iron) పడవను కూడా పట్టుకున్నట్లు అధికారులు చెప్పారు.
భారత జలాల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గురించి రహస్య సమాచారం మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్, ATS అధికారులు నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ఓఖా పోర్ట్‌కు కొన్ని వందల నాటికల్ మైళ్ల దూరంలో ఇరాన్ పడవ చేపల వేట చేస్తున్నట్లు గుర్తించినట్లు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) వర్గాలు తెలిపాయి. ఆ క్రమంలో వారి కదలికలపై అనుమానం వచ్చి వారిని వెంబడించి.. బోటును తనిఖీ చేయగా 61 కిలోల మాదక ద్రవ్యాలు(drugs) వెలుగులోకి వచ్చినట్లు అధికారులు(officers) స్పష్టం చేశారు.
ఇంకోవైపు పశ్చిమ బెంగాల్(Bengal)లోని నాడియా జిల్లాలోని కళ్యాణి సరిహద్దు ఔట్‌పోస్ట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమంగా దాచిన బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఓ చెరువులో బీఎస్ఎఫ్ అధికారులు సుమారు రూ. 2.57 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. రహస్య సమాచారం ఆధారంగా బంగారాన్ని(gold) గుర్తించేందుకు బీఎస్ఎఫ్(BSF) బృందం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. చెరువులో 40 బంగారు బిస్కెట్లు దొరికాయని….కొన్ని నెలల క్రితం వెంబడించడంతో ఓ స్మగ్లర్ చెరువులోకి దూకి బంగారాన్ని దాచిపెట్టాడని అధికారులు వెల్లడించారు.