ఆంధ్ర ప్రదేశ్ (andhra pradesh) ప్రజలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను (jana sena chief pawan kalyan) అంతకా విశ్వసించడం లేదని పర్యాటక రంగ శాఖ మంత్రి ఆర్కే రోజా (ap tourism minister rk roja) శుక్రవారం అన్నారు. నగరి నియోజకవర్గంలో (nagari assembly constituency) జగనన్నే మా భవిష్యత్తు (jagananna mana bhavishyathu) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేనాని పైన నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ నగరిలో తనను, పులివెందులలో (pulivendula) తమ పార్టీ అధినేత జగన్ ను (ys jagan) ఓడిస్తారని అనుకోవడం అవివేకమే అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడుతో (chandrababu naidu) కలవాలనే ఆలోచన ఆయనకు ఉంటే ఎవరు కలపకుండా ఉంటారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల్లో పవన్ పైన నమ్మకం లేదన్నారు. పార్టీ పెట్టి పవన్ అసలు ఏం చేస్తున్నాడో చెప్పాలన్నారు. చంద్రబాబులా మ్యానిఫెస్టో వెబ్ సైట్ నుండి తీసేయలేదని ఎద్దేవా చేశారు. జగనన్నే మా భవిష్యత్తు (jagananna mana bhavishyathu) కార్యక్రమం గత ప్రభుత్వ పాలన (telugu desam government), జగన్ పాలనకు (ycp government) సంబంధించి ప్రజల నుండి అభిప్రాయాలు తెలుసుకునే కార్యక్రమం అన్నారు.
ఐదు అంశాల పైన ప్రజల నుండి అభిప్రాయం సేకరించి… వారు ఈ ప్రభుత్వంపై విశ్వాసం చూపిస్తే కనుక అలాంటి వారి ఇంటికి వారి అనుమతితోనే మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ ను అంటిస్తామని చెప్పారు. గతంలో చంద్రబాబు (chandrababu naidu) అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ఎలా పరిపాలించారో మనం చూశామన్నారు. లబ్ధిదారుడికి అర్హత ఉంటే చాలు.. నేరుగా పథకాలు అమలు చేయాలని జగన్ (ys jagan mohan reddy) చెబుతున్నారని అన్నారు. దేశ చరిత్రలోనే జగన్ చేసిన కార్యక్రమాలు (ys jagan schemes) ఎవరూ చేయడం లేదన్నారు.