»Pills No Longer Work For Contraception Center To Implement A New Policy In Telugu States
Contraception: గర్భనిరోధానికి పిల్స్‌తో పనిలేదు, తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం కొత్త విధానం
మాత్రలు, ఇంజెక్షన్ లు, కాపర్ టీ, కండోమ్ ( pills, injections, copper-t, condoms) వంటి గర్భ నిరోధక పద్ధతుల స్థానంలో (existing methods of contraception) కొత్త పద్ధతి రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States, Andhra Pradesh, Telangana) దీనిని తొలిసారి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం (central government) యోచిస్తోంది.
మాత్రలు, ఇంజెక్షన్ లు, కాపర్ టీ, కండోమ్ ( pills, injections, copper-t, condoms) వంటి గర్భ నిరోధక పద్ధతుల స్థానంలో (existing methods of contraception) కొత్త పద్ధతి రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States, Andhra Pradesh, Telangana) దీనిని తొలిసారి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం (central government) యోచిస్తోంది. ఈ కొత్త విధానం 3 నుండి 4 సెంటీమీటర్ల పొడవు, 2 నుండి 4 మిల్లీ మీటర్ల పొడవుతో సూదిలా ఉంటుంది. దీనిని మోచేతి చర్మ కింద పైపొరలో అమరుస్తారు. ఇందులో గర్భాన్ని నిరోధించే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. వాస్తవానికి ఈ సాధనం హార్మోన్ తో తయారవుతుంది. సంతానం మధ్య దూరం ఉండాలని కోరుకునే వారు ఈ దీనిని ఉపయోగించుకోవచ్చు. దీంతో భార్యభర్తల సఖ్యతకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్య నిపుణులు (Doctors) చెబుతున్నారు. ఈ విధానాన్ని సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్స్ (Subdermal Contraceptive Implants) అని పిలుస్తారు.
ఈ సాధనాన్ని అన్ని రాష్ట్రాల్లో ఉచితంగా పంపిణీ (free of cost) చేయాలనికేంద్రం (Central Government) నిర్ణయం తీసుకున్నది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Government Hospital) దీనిని అందుబాటులో ఉంచనున్నారు. దీనిని సులభంగా అమర్చడానికి శిక్షణ కూడా ఇస్తారు. ఈ సాధనం వల్ల ఎలాంటి అసౌకర్యం ఉండదు. దీని అవసరం లేదు అనుకుంటే సులభంగా కూడా తొలగించుకోవచ్చు. తొలగించిన నలభై ఎనిమిది గంటల తర్వాత గర్భధారణకు అవకాశం ఉంది. ఈ సాధనాన్ని కుడిచేతి వాటం వారికి ఎడమ వైపున, ఎడమ చేతి వాటం వారికి కుడి వైపున అమరుస్తారు.
కెన్యాలో (Kenya) దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఈ విధానం అమల్లో ఉంది. సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్స్ లో పాలిమర్ క్యాప్సూల్స్ లేదా చర్మం కింద ఉంచిన రాడ్స్ నుండి స్టెరాయిడ్ ప్రొజెస్టిన్ డెలివరీ ఉంటుంది. హార్మోన్ స్థిరంగా నెమ్మదిగా వ్యాప్తిస్తుంది. గర్భ నిరోధక ప్రభావాన్ని ఒకటి నుండి అయిదు సంవత్సరాల వరకు అందిస్తుంది.