బీజేపీ లేదా నరేంద్ర మోడీ వ్యతిరేక కూటమికి తనను చైర్మన్ గా చేస్తే వచ్చే లోకసభ ఎన్నికల్లో ఖర్చు మొత్తం తానే భరిస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
దేశాన్ని సర్వనాశనం చేస్తున్న నరేంద్ర మోదీని సాగనంపేందుకు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని తరిమికొట్టేందుకు పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. పదేళ్లలో కనిపించని అరుదైన దృశ్యం నేడు కనిపించింది.
పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ నేతలతో కలుస్తూ, పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం మురళీధర రావుతో భేటీ అనంతరం పవన్ ను మీడియా ప్రశ్నించగా.. ఇంకా పలువురు నేతలను కలవాల్సి ఉందని, అందరినీ కలిశాక మాట్లాడుతానని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఆసరా నిధుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు ఎవరూ చంద్రబాబుకు ఓటేయరని చెప్పారు.
పెళ్లైన రెండు రోజులకే వరుడు ఆకస్మాత్తుగా మరణించాడు. అయితే తనకు వచ్చిన హోం థియేటర్(home theater) పేలిన(blast) క్రమంలో అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వరుడితోపాటు అతని బంధువు కూడా ఒకరు మృతి చెందగా, ఇంకో ఏడుగురికి గాయలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్(chhattisgarh)లోని రెంగాఖర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చమరి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు కొశ్చన్ పేపర్ లీకయ్యింది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్ఎస్‌యూఐ ఏకంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
దేశంలో(india) కొత్తగా 3,641 కరోనా కేసులు(corona cases) నమోదు కాగా..మరో 11 మంది ఈ వ్యాధి కారణంగా మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల(active cases) సంఖ్య 20,219కు పెరిగింది. ఈ క్రమంలో రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు 6.12 శాతం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
జార్ఖండ్‌లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగగా.. ఐదుగురు మృతిచెందారు. వీరిలో ఇద్దరు మావోయిస్ట కీలక నేతలు ఉన్నారు. వీరి తలపై రూ.25 లక్షల చొప్పున రికార్డు ఉంది.