టాలీవుడ్ స్టార్ హీరో, RRR నటుడు జూనియర్ ఎన్టీఆర్(NTR) త్వరలోనే హాలీవుడ్లో(Hollywood) ఓ మూవీ చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే RRR మూవీలో నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో ఈ హీరో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ హీరో గురించి హాలీవుడ్ డైరెక్టర్(james gunn) కీలక వ్యాఖ్యలు చేశారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
తెలంగాణలో వివిధ విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లపై ప్రభుత్వం అణిచివేత చర్యలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వేతనాలు పెంచాలంటూ సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లను తొలగిస్తున్నట్లు(200 Artizens Dismiss) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మరికొందరు బుధవారం ఉదయంలోగా విధుల్లోకి రావాలని, లేని పక్షంలో వారిని కూడా విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.
తెలంగాణ(telangana)లో ధరణి పోర్టల్(dharani portal) వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పోర్టల్ వల్ల సమస్యలు తీరకపోగా..మధ్యవర్తులే(brokers) ఎక్కువగా లాభపడుతున్నారని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బోర్డర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు జిల్లా అరవపల్లి సమీపంలోని కత్తార్లపల్లి దగ్గర వేగంగా వెళుతున్న కారు ప్రమాదవశాత్తు చెట్టును ఢీ కొట్టింది. దీంతో ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే మృతులు పుంగనూరు కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు. కేస...
మధుర రోడ్డులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS)కు గురువారం ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. బెదిరింపు ఈమెయిల్ ద్వారా వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాలలోకి అంబులెన్స్, పోలీసు వ్యాన్లను మోహరించారు. పాఠశాల ఆవరణలో ఇంకా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని సౌత్ ఈస్ట్ DCP రాజేష్ డియో తెలిపారు. పరిస్థితి సాధారణంగా ఉందన్నారు. బాంబ్ డిస్పోజ...
వాట్సాప్(WhatsApp) వినియోగదారులకు మంచి అప్ డేట్ వచ్చేసింది. ఎందుకంటే ఇక నుంచి ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సాప్ ఖాతాను ఉపయోగించుకోవచ్చు. అవును మీరు విన్నది నిజమే. నిన్న సాయంత్రం వాట్సాప్ సంస్థ ఈ మేరకు ప్రకటించింది.
హైదరాబాద్(hyderabad)లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి(heavy rain) పలు చోట్ల పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరింది. మరోవైపు రోడ్లపై నీరు భారీగా చేరడంతో వాహనదారులు రోడ్లపై ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు పెద్ద ఎత్తున చేరడంతో…ఆ ప్రాంతాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంకోవైపు ఓ చిన్నారి కూడా మృత్యువాత చెందింది.
ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత వెంటనే చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటో ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఈరోజు మీ బలాలు, బలహీనతలు, మంచి పనులు చేయాలా వద్దా, ఏవైనా అడ్డంకులు వస్తాయా అని తెలుసుకోవడం తప్పనిసరి అని చెప్పవచ్చు. ఈ క్రమంలో నేటి మీ రాశి ఫలాలు(april 26th horoscope in telugu) ఎలా ఉన్నాయి? ఏం జరగబోతుందో ఈ వార్తను చదివి ఒక్కసారి తెలుసుకోండి మరి.
హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. గాలి దుమారం వీయడంతో కరెంట్ తీసివేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరును సీబీఐ చేర్చింది.
తిరుమల తిరుపతి దేవస్థానం పరిసరాల్లో ఈ రోజు 3 హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆరాతీస్తున్నారు.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న మలేరియా దినోత్సవాన్ని(malaria day) జరుపుకుంటారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. మలేరియాకు సకాలంలో చికిత్స అందించకపోతే, అది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.
2023-24కి గాను నాస్కామ్(Nasscom)కు కొత్త ఛైర్‌పర్సన్‌గా అనంత్ మహేశ్వరి(Anant Maheshwari) ఎంపికయ్యారు. అయితే అనంత్ మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ గా చేస్తుండటం విశేషం. మరోవైపు కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, ఎండీ రాజేష్ నంబియార్‌ను అదే సమయ వ్యవధిలో వైస్ చైర్‌పర్సన్‌గా నియమించినట్లు నాస్కామ్ ప్రకటించింది.
అగ్రరాజ్యం అమెరికా 80 ఏళ్ల అధ్యక్షుడు జో బైడైన్ మళ్లీ వచ్చే ఎన్నికల్లో 2024లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ సైతం 2024 ఎలక్షన్లలో పోటీ చేస్తానని వెల్లడించారు.