»Odisha Train Accident 18 Trains Cancelled 7 Diverted And Railway Helpline Also
Odisha train accident: 43 రైళ్లు రద్దు, 38 మళ్లింపు, హెల్ప్ లైన్ కూడా
ఒడిశా రైలు దుర్ఘటన తర్వాత 18 రైళ్లు రద్దు చేయబడ్డాయి. వాటిలో ఏడు దారి మళ్లించబడ్డాయి. ఒక రైలు పాక్షికంగా రద్దు చేయబడింది. దీంతోపాటు రైల్వే హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన వినాశకరమైన ట్రిపుల్ రైలు ప్రమాదంలో కనీసం 233 మంది మరణించారు. 900 మందికి పైగా గాయపడ్డారని అధికారులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో పద్దెనిమిది సుదూర రైళ్లు రద్దు చేయబడ్డాయి. ఏడు రైళ్లను టాటానగర్ స్టేషన్ మీదుగా మళ్లించారు. భారతీయ రైల్వే వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా లేదా భారతీయ రైల్వే హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ప్రయాణించే ప్రజలు ముందు తమ రైలు స్థితిని తనిఖీచేసుకుని ప్రయాణించాలని అధికారులు కోరారు.
12841 షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఖరగ్‌పూర్-టాటా-జార్సుగూడ-సంబల్పూర్ సిటీ-కటక్ మీదుగా మళ్లించబడుతుంది.
18477 పూరీ-యోగ్ నగ్రి రిషికేశ్ జార్సుగూడకు బదులుగా సంబల్పూర్ సిటీ-జార్సుగూడ రోడ్-IB మీదుగా మళ్లించబడుతుంది.
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో గోవా నుంచి ముంబైకి శనివారం ప్రారంభించాల్సిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కార్యక్రమం రద్దు చేయబడిందని కొంకణ్ రైల్వే అధికారి తెలిపారు. గోవాలోని మడ్గావ్ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తదుపరి సహాయం కోసం ఒడిశా ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది: 06782-262286