Jr. NTR : ఏ ముహూర్తాన ఎన్టీఆర్, కొరటాల శివ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారో గానీ.. సెట్స్ పైకి మాత్రం వెళ్లడం లేదు. ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్', కొరటాల శివ 'ఆచార్య' సెట్స్ పై ఉన్నప్పుడే ఎన్టీఆర్ 30 ప్రకటించారు. అయితే ఆచార్య ఫ్లాప్ అవడంతో.. కొరటాల కోలుకోవడానికి కాస్త సమయం పట్టింది.
ఏ ముహూర్తాన ఎన్టీఆర్, కొరటాల శివ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారో గానీ.. సెట్స్ పైకి మాత్రం వెళ్లడం లేదు. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’, కొరటాల శివ ‘ఆచార్య’ సెట్స్ పై ఉన్నప్పుడే ఎన్టీఆర్ 30 ప్రకటించారు. అయితే ఆచార్య ఫ్లాప్ అవడంతో.. కొరటాల కోలుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఈసారి తారక్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్టు రాసుకున్నాడు. కానీ ఈ సినిమా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోవడం లేదు. అయితే ఎట్టకేలకు ఫిబ్రవరి 24న లాంచనంగా మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యారు. కానీ తారక రత్న మరణం అందరినీ కలిచి వేసింది. దాంతో ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌ను పోస్ట్ పోన్ చేశారు. త్వరలోనే మరో కొత్త ముహూర్తం ఫిక్స్ చేయబోతున్నట్టు పీఆర్ టీమ్ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు అసలు ఓపెనింగ్ లేకుండానే సెట్స్ పైకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యంగ్ టైగర్.. నేరుగా సెట్స్ పైకి వెళ్ళిపోదామని దర్శకుడు కొరటాల శివకి చెప్పాడట. అతి త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. మార్చి 20న ఎన్టీఆర్ 30 రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈలోపు ఎన్టీఆర్.. ఆస్కార్ కోసం అమెరికా వెళ్లి రానున్నాడు. మార్చి 12న ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమం ఉంది. ఇప్పటికే రామ్ చరణ్ యూస్ ఫ్లైట్ ఎక్కేశాడు. త్వరలోనే ఎన్టీఆర్, రాజమౌళి ఆస్కార్ కోసం వెళ్లనున్నారు. తిరిగొచ్చాక ఎన్టీఆర్ 30 షూటింగ్లో జాయిన్ అవనున్నాడు తారక్. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్నట్టుగా.. ఓపెనింగ్ కార్యక్రమం లేకుండానే ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది.