నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో (NCP) ముసలం కనిపిస్తోంది. పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ (NCP leader Ajit Pawar) తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో (bjp) చేరే యోచన చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. NCP అధినేత శరద్ పవార్ కూతురు (sharad pawar daughter), ఎంపీ సుప్రియా సూలే (mp Supriya Sule) అంతకుముందే బాంబు పేల్చారు. రానున్న పదిహేను రోజుల్లో రెండు పెద్ద రాజకీయ కుదుపులు (political explosions) ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఒకటి ఢిల్లీలో, రెండోది మహారాష్ట్రలో (maharashtra) అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అజిత్ పవార్ (ajit pawar) అంశం చర్చనీయాంశంగా మారింది. ఆయన బీజేపీలో చేరుతారా లేదా అనే విషయం పక్కన పెడితే… అజిత్ తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి తన ఎన్సీపీ పార్టీ లోగోను తీసేశారు. అజిత్ తో 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రఫుల్ పటేల్ కూడా అజిత్ వైపు అడుగులు వేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
అజిత్ పవార్ చుట్టూ జరుగుతున్న ఊహాగానాలకు శరద్ పవార్ దూరంగా ఉన్నారు. బిజెపిలోకి వెళ్లడానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కలిసి సమావేశ ప్రయత్నం చేశారనే వాదనలు వినిపించాయి. ఈ వార్తలను శరద్ పవారే కొట్టి పారేశారు. ఆ నివేదికల్లో నిజం లేదని, అజిత్ పవార్ ఏ సమావేశానికి పిలవలేదని, అతను పార్టీ కోసం పని చేస్తున్నాడని, కేవలం మీకు మీరే ఊహించుకుంటున్నారని శరద్ పవార్ విలేకరులతో అన్నారు. తన మేనల్లుడు అజిత్ పవార్ తో విభేదాలు ఉన్నాయనే వాదనలను ఖండించారు.
ఉద్దవ్ థాకరే వర్గం శివసేన నేత సంజయ్ రౌత్ కూడా అజిత్ బీజేపీ వైపు వెళ్తారనే వార్తలను కొట్టి పారేశారు. అదంతా అసత్య ప్రచారమని, ఆయన బీజేపీలో చేరడం లేదన్నారు.
అలాగే, ముంబైలోని కుదుపు గురించి సుప్రియా సూలే మాట్లాడుతూ… అజిత్ పవార్ గురించి తాను మాట్లాడటం లేదని, అదే విషయం మీరు ఆయనను అడగాలని విలేకరులకు సూచించారు. ప్రజాప్రతినిధిగా తనకు చాలా పని ఉందని, ఉత్తినే మాట్లాడేందుకు తనకు సమయం లేదన్నారు.
శరద్ పవార్ కాదన్నా… అజిత్ మాత్రం బీజేపీ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ కూడా అజిత్ పవార్ కు వెల్ కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉందట. కొంతమంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు కూడా అజిత్ కు అండగా ఉన్నారని తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం అజిత్ పవార్ ఇంటికి వెళ్లిన ఎన్సీపీ ఎమ్మెల్యే అనిల్ పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ.. నేను దాదాతో ఉన్నాను అని చెప్పారు. బిజెపి వైపు వెళ్లడంపై పాటిల్ మాట్లాడుతూ… దాదా ఇప్పటి వరకు తమను దాని గురించి అడగలేదని, అతను అడిగితే, మేము దాని గురించి మాట్లాడుతామని చెప్పారు.