Nara lokesh:సీఎం జగన్‌పై (cm jagan) టీడీపీ యువనేత నారా లోకేశ్ (Nara lokesh) విమర్శలు గుప్పించారు. లోకేశ్ యువగళం (yuvagalam) పాదయాత్ర అనంతపురం నియోజకవర్గంలోకి కొనసాగుతోంది. విజయ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. సీఎం జగన్ (jagan) లక్ష్యంగా విమర్శలు చేశారు.
గత ఎన్నికల ముందు నేల జగన్‌ను చూశాం అని లోకేశ్ (lokesh) పేర్కొన్నారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే గాలి జగన్‌ను (jagan) చూస్తున్నామని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకు జగన్ నేలపైకి వచ్చాడని పేర్కొన్నారు. సింహం సింగిల్‌గా వస్తోందని ఫోజులు కొట్టి.. ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయాలని అడగడం ఏంటీ అన్నారు.
బటన్ నొక్కితే అయిపోతుందని అనే జగన్ (jagan).. రాష్ట్రానికి ఏం చేశారని లోకేశ్ (lokesh) అడిగారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను నిలిపివేశారని తెలిపారు. 100 సంక్షేమ పథకాలను తొలగించి గిన్నిస్ బుక్‌లో ఎక్కాడని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అనంతపురం (anantapuram) పుణ్యభూమి అని లోకేశ్ (lokesh) చెప్పారు. ఎస్కే వర్సిటీలో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రొఫెసర్‌గా పనిచేశారని గుర్తుచేశారు. ఇక్కడే చదివిన నీలం సంజీవయ్య కూడా రాష్ట్రపతి పదవీ చేపట్టారని గుర్తుచేశారు. ఈ గడ్డపై పాదయాత్ర చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని వివరించారు.
వచ్చే ఏడాది మే నెలలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. లోకేశ్ యువగళం యాత్రతో జనం ముందుకు వచ్చారు. సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను ఆయన మరిచారని మండిపడ్డారు.