»Mlc Kavitha Reached To Ed Office For Third Day Investigation In Delhi Liqour Policy Case
MLC Kavitha: ఈడీ ఆఫీసుకు చేరిన కవిత..మీడియాకు ఫోన్స్ చూపించిన ఎమ్మెల్సీ
బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కొద్దిసేపటి క్రితం ఈడీ(ED) ఆఫీసుకు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor scam) కేసులో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత మూడోసారి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సీఎం కేసీఆర్(CM KCR) నివాసం నుంచి ఆమె ఈడీ ఆఫీసుకు బయల్దేరి వెళ్లారు. ఈడీ ఆఫీసులోకి వెళ్లే ముందు ఆమె తన రెండు ఫోన్లను మీడియా ముందు ఉంచారు. ప్రజలకు అభివాదం చేశాక ఆమె తన మొబైల్స్ ను అందరికీ చూపించారు.

నేటి విచారణలో భాగంగా తన రెండు ఫోన్లను ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఈడీకి సమర్పించనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఎమ్మెల్సీ కవిత మార్చి 11వ తేదిన మొదటి సారి ఈడీ(ED) విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆమెను 16న మరోసారి ఈడీ విచారణకు రావాలని నోటీసులిచ్చినా ఆమె విచారణకు రానని, సుప్రీం కోర్టులో పిటిషన్ వేశానని తెలిపారు. ఈ నెల 24న సుప్రీం కోర్టులో పిటిషన్ పై తీర్పు రానుంది. అలాగే సోమవారం కూడా ఆమె విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) రెండోసారి ఈడీ విచారణకు హాజరవ్వగా సుమారు పదిన్నర గంటల పాటు ఆమెను ఈడీ(ED) అధికారులు విచారించారు.
తిరిగి మూడోసారి మంగళవారం ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఈడీ నోటీసుల నేపథ్యంలో విచారణకు హాజరయ్యారు. కవితను ఇతర అధికారులతో కాకుండా విడిగానే ఈడీ(ED) ప్రశ్నించినట్లు సమాచారం. అయితే కవితను ఇతర నిందితులతో కలిపి ప్రశ్నలు అడిగినట్లు లీకులు వైరల్(Viral) అయ్యాయి. అయితే కవితను ఎక్కువ సమయం విచారించకుండా ఖాళీగానే కూర్చోబెట్టినట్లు సమాచారం. స్పష్టమైన ఆధారాలు ఏవీ లేకుండానే మానసికంగా వేధించేందుకే ఈడీ(ED) అధికారులు అలా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.