»Means Allah Is Deaf Karnataka Bjp Mlas Controversial Remark On Azaan
BJP MLA Eshwarappa : అల్లా చెవిటివాడా..? బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్..!
BJP MLA Eshwarappa : బీజేపీ నేతలు చాలా మంది ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. ముఖ్యంగా మతపరమైన వ్యాఖ్యలు చేసి వివాదంలోకి దూరడం వారికి అలవాటు. ఇప్పటి వరకు చాలా మంది బీజేపీ నేతలు అలాంటి వివాదాల్లో ఇరుక్కోగా... తాజాగా ఈ జాబితాలోకి మరో బీజేపీనేత వచ్చిచేరారు.
బీజేపీ నేతలు చాలా మంది ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. ముఖ్యంగా మతపరమైన వ్యాఖ్యలు చేసి వివాదంలోకి దూరడం వారికి అలవాటు. ఇప్పటి వరకు చాలా మంది బీజేపీ నేతలు అలాంటి వివాదాల్లో ఇరుక్కోగా… తాజాగా ఈ జాబితాలోకి మరో బీజేపీనేత వచ్చిచేరారు.
మసీదుల్లో అజాన్‌కు లౌడ్ స్పీకర్ల వాడకం ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీయగా, తాజాగా అజాన్ వ్యవహారంపై కర్ణాటక బీజేపీ నేత, మాజీ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
”లౌడ్ స్పీకర్లతో ఆయనను పిలవడానికి అల్లా ఏమైనా చెవిటివాడా?” అని ప్రశ్నించారు. ఒక బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపాయి.
”అజాన్ అంటే ప్రార్థనా పిలుపు. నేను ఎక్కడకు వెళ్లినా ఇది (అజాన్) ఒక తలనొప్పిగా మారింది. ఈ విషయంపై ఎప్పుడో ఒకప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఇవాళ కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు అజాన్ కి తెరపడుతుంది” అని ఈశ్వరప్ప అన్నారు.
అజాన్‌కు లౌడ్ స్పీకర్లు ఉపయోగిస్తేనే అల్లాకు వినపడుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఆలయాల్లో ఆడపిల్లలు, మహిళలు మతపరమైన ప్రార్థనలు- భజనలు చేస్తుంటారని, ఇందుకు లౌడ్ స్పీకర్లు ఉపయోగించరని చెప్పారు. ”ప్రార్థనలు చేసేందుకు లౌడ్ స్పీకర్లు వాడుతున్నారంటే అల్లా చెవిడివాడని అర్ధం” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈయన గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిప్పు సుల్తాన్‌ను ముస్లిం గూండా అంటూ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. తాను చనిపోవడానికి ఈశ్వరప్పే కారణం అంటూ లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు కాంట్రాక్టర్. అది కూడా వివాదాస్పదమైంది.