KTR : హైదరాబాద్ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలను మెట్రో చాలా వరకు తీర్చిందనే చెప్పాలి. మెట్రో అడుగుపెట్టిన తర్వాత ప్రయాణం కాస్త సులువుగా మారింది. కాగా... ఈ మెట్రో సదుపాయాలను మరింత పెంచుతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలో ప్రస్తుతం మెట్రో రైలు సేవలు అందుబాటులోని లేని ప్రాంతాలను కూడా కవర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీ వరకు కూడా మెట్రోను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారీగా మెట్రో విస్తరణ పనులను చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలను మెట్రో చాలా వరకు తీర్చిందనే చెప్పాలి. మెట్రో అడుగుపెట్టిన తర్వాత ప్రయాణం కాస్త సులువుగా మారింది. కాగా… ఈ మెట్రో సదుపాయాలను మరింత పెంచుతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలో ప్రస్తుతం మెట్రో రైలు సేవలు అందుబాటులోని లేని ప్రాంతాలను కూడా కవర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీ వరకు కూడా మెట్రోను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారీగా మెట్రో విస్తరణ పనులను చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చాక మెట్రో ఫేజ్ 3 పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. దశల వారీగా మెట్రో విస్తరణ పనులను చేపడతామని వెల్లడించారు. నగరంలో ఇతర ప్రాంతాల్లో కూడా మెట్రో సేవలను విస్తరిస్తామని కేటీఆర్ ప్రకటించారు.
31 కిలోమీటర్ల ఎయిర్ పోర్టు మెట్రో సేవలు, 28 కిలోమీటర్ల లక్డీ కా పూల్, బీహెచ్ఈఎల్ కారిడార్ కూడా రెండో దశలో పూర్తి కానుంది. బీహెచ్ఈఎల్ లక్డీకా పూల్ కారిడార్ లో చందానగర్, ఆల్విన్ క్రాస్ రోడ్స్, హఫీజ్ పేట్, కొత్తగూడ, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, కాజాగూడ, విస్పర్ వ్యాలీ, టోలీచౌక్, రేతిబౌలి, మెహదీపట్నం, మసాబ్ ట్యాంక్ ప్రాంతాలు కలవనున్నాయి.