»Kotak Mahindra Bank Withdraws Ad Featuring Tanmay Bhat
Kotak Mahindra: నోటి దురుసు, తన్మయ్ భట్‌ను యాడ్ నుండి తొలగించిన బ్యాంకు
దేశీయ ప్రయివేటురంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంకు (Kotak Mahindra Bank) ప్రముఖ కమెడియన్ తన్మయ్ భట్‌తో (Tanmay Bhat) వ్యాపార ప్రకటనల కోసం ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే ఆయన నోటి దురుసు కారణంగా బ్యాంకు ఆయనను తప్పించే వరకు వచ్చింది.
దశాబ్దం క్రితం హిందూ దేవుళ్లను దూషించిన ఓ కమెడియన్‌కు ఓ బ్యాంకు గట్టి షాక్ ఇచ్చింది. కస్టమర్ల విజ్ఞప్తి మేరకు అతనిని తమ యాడ్ నుండి తొలగించింది. దేశీయ ప్రయివేటురంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంకు (Kotak Mahindra Bank) ప్రముఖ కమెడియన్ తన్మయ్ భట్‌తో (Tanmay Bhat) వ్యాపార ప్రకటనల కోసం ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే ఆయన నోటి దురుసు కారణంగా బ్యాంకు ఆయనను తప్పించే వరకు వచ్చింది. పదకొండేళ్ల క్రితం తన్మయ్ ఓ సామాజిక వర్గాన్ని, అలాగే దేవుళ్లను, చిన్న పిల్లల గురించి అసభ్యకర వ్యాఖ్యలను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై అప్పుడు దుమారం రేగింది. అయితే ఇప్పుడు కొటక్ మహీంద్రా (Kotak Mahindra Bank) అతనిని తన వ్యాపార ప్రకటనకు నియమించుకోవడంతో వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభమైంది. దీనిని ఆదిలోనే గుర్తించిన కొటక్ మహీంద్రా అతనిని తొలగిస్తున్నట్లు ట్వీట్ చేసింది.
తాజాగా, ఈ బ్యాంకు 811 పేరుతో కమెడియన్ గ్రూప్ ఆల్ ఇండియా బక్ చోడ్తో ( All India Bakchod) కలిసి కమెడియన్ తన్మయ్ భట్, సమయ్ రైనాలతో కలిసి ఓ యాడ్ కంపైన్ను నిర్వహించేందుకు సిద్ధపడింది. అయితే నెటిజన్లు… అతను పది పదకొండేళ్ల క్రితం చేసిన ట్వీట్లను వెలుగులోకి తెచ్చి ఈ బ్యాంకును ప్రశ్నించారు. వీటిని కొటక్ బ్యాంకు, ఉదయ్ కొటక్లకు రీట్వీట్ చేస్తూ… బైకాట్ నినాదానికి తెరలేపారు. ‘నేను కొటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్‌ను. అయితే మీరు హిందూఫోబిక్, మహిళలు, పిల్లల అబ్యూజర్ను వ్యాపార ప్రకటనల కోసం నియమించుకున్నారు. ఇది తమను గాయపరిచింది. కాబట్టి మీ బ్యాంకులో మా అకౌంట్ క్లోజ్ చేయాలని భావిస్తున్నాం. అతనిని (తన్మయ్ భట్) వ్యాపార ప్రకటన నుండి తప్పిస్తారా? అని మోనికా వర్మ అనే యువతి ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా బ్యాంకు తీరును తప్పుబట్టారు. డియర్ ఉదయ్ కొటక్… హిందుత్వాన్ని, వినాయకుడిని విమర్శించే తన్మయ్ భట్‌ను మీరు మీ బ్యాంకు ప్రచారానికి ఉపయోగించుకుంటే మాలాంటి కస్టమర్లు అంగీకరిస్తారా? అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. ఇలా చాలామంది నెటిజన్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో కొటక్ మహీంద్రా వెనక్కి తగ్గింది.
తన్మయ్ భట్ వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు తాము మద్దతివ్వడం లేదని చెబుతూ, కస్టమర్లను క్షమాపణలు కోరింది. అంతేకాదు, కమెడియన్ గ్రూప్ ఆల్ ఇండియా బక్ చోడ్తో కలిసి చేసే ఈ వ్యాపార ప్రకటన నుండి విరమించుకుంటున్నట్లు తెలిపింది. కొటక్ మహీంద్రా అతనిని తమ వ్యాపార ప్రకటన నుండి తొలగించడంతో మోనికా వర్మ మరోసారి స్పందించారు. బ్యాంకు నిర్ణయాన్ని ప్రశంసిస్తూ, అన్ని బ్యాంకులు, సంస్థలు కూడా అంబాసిడర్‌గా నియమించుకునే సమయంలో వారి ప్రవర్తనను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అందులో ఇరుక్కోవడం మొదటిసారి కాదు. గతంలో ‘మీటూ’ ఉద్యమం సమయంలోను నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఇతను రైటర్, కమెడియన్, నిర్మాత, యూట్యూబర్, స్క్రిప్ట్ రైటర్. ఇతను ఆల్ ఇండియా బక్ చోడ్ కోఫౌండర్.