రుణాలు(Loans), అడ్వాన్సులకు సంబంధించిన పరిమితులు, మోసాల వర్గీకరణ, బ్యాంకుల రిపోర్టింగ్‌కు సంబంధించిన ప్రమాణాలను ఉల్లంఘించినందుకు ICICI బ్యాంక్‌పై ఈ జరిమానా విధించినట్లు RBI మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
RBI :కొన్ని రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినందుకు.. రిజర్వ్ బ్యాంక్ (RBI) ఐసీఐసీఐ బ్యాంక్‌పై రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రూ.3.95 కోట్లు జరిమానా విధించింది. రుణాలు(Loans), అడ్వాన్సులకు సంబంధించిన పరిమితులు, మోసాల వర్గీకరణ, బ్యాంకుల రిపోర్టింగ్‌కు సంబంధించిన ప్రమాణాలను ఉల్లంఘించినందుకు ICICI బ్యాంక్‌పై ఈ జరిమానా విధించినట్లు RBI మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయం విన్న ఈ రెండు బ్యాంకులకు చెందిన ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. ఇది వినియోగదారులపై ఎటువంటి ప్రభావం చూపదని పేర్కొంది.
RBI ఏం చెప్పింది?
ఆర్థిక సేవల ఔట్‌సోర్సింగ్‌లో రిస్క్ మేనేజ్మెంట్, ప్రవర్తనా నియమావళి(code of conduct)కి సంబంధించిన సూచనలను పాటించనందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై పెనాల్టీ విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ మరో ప్రకటనలో తెలిపింది. ఈ చర్య బ్యాంక్ నియమించబడిన రికవరీ ఏజెంట్, కస్టమర్ సర్వీస్, లోన్, అడ్వాన్స్ ప్రొవిజన్లలోని లోపాలకు కూడా సంబంధించినది. RBI ప్రకారం.. రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా లోపాలను గుర్తించిన RBI.. అందుకు సంబంధించిన రెండు కేసుల్లో ఈ జరిమానా విధించింది.