»Karnataka Assembly Polls 2023 Survey Shows Congress Still In The Lead In Karnataka
Survey: కర్ణాటకలో కాంగ్రెస్ దే పైచేయి..? సర్వేలు ఏం చెబుతున్నాయి?
కర్నాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓ పోల్ సర్వే కీలక అభిప్రాయాలను తెలియజేసింది. చివరి దశలో బీజేపీ(BJP) బలమైన విజయాలు సాధించినప్పటికీ.. కాంగ్రెస్(congress) ఈ ఎన్నికల్లో ఆధిక్యంలో ఉంటుందని వెల్లడించింది.
కర్ణాటక(Karnataka)లో ఎన్నికలు దగ్గరపడ్డాయి. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ప్రచారాలు హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉండటంతో ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉందో పార్టీలు సర్వేలు చేయడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో లోక్ పాల్ సర్వే షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్(congress) దే విజయం అని తేల్చి చెబుతున్నాయి. కేవలం లోక్ పాల్ సర్వే మాత్రమే కాదు, పీపుల్స్ పల్స్ సర్వేలో కూడా ఇదే తేలింది.
మహిళలు, పురుషులతో పాటు అన్ని వయసుల వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోగా, ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం, సామాజిక అంశాలు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇలా అన్ని రంగాలలో కాంగ్రెస్ ఇతర పార్టీల కంటే ముందుందని సర్వేలు చెబుతున్నాయి. కోస్తా కర్ణాటకకు మినహాయించి అన్ని ప్రాంతాల్లో హస్తం తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ(BJP) కంటే ముందుంజలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్(congress) 100 స్థానాలకు పైగా పొంది, స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 129 నుంచి 134 స్థానాలు గెలుపొందే అవకాశం ఉందని సర్వే చెబుతోంది. 59 నుంచి 65 సీట్లకు బీజేపీ పరిమితం కానుందట.
జేడీఎస్(JDS)కు 23 నుంచి 28 స్థానాలు వస్తాయట. కాంగ్రెస్(congress)కు 42 నుంచి 45 శాతం వరకు ఓట్లు పడే అవకాశం ఉందట. బీజేపీ(BJP) ఓట్ల శాతం 36 నుంచి 32 శాతానికి పడిపోతాయని సర్వేలో పేరొన్నారు. మరి విజయం ఎవరిదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. ఈ రోజుతో కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరగనుంది.