KA Paul: కేసీఆర్! జార్జ్ బుష్ నా ముందు మోకరిల్లారు… నువ్వెంత.. దొంగవు!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Telangana), భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) పైన ప్రజా శాంతి పార్టీ (praja shanti party) అధ్యక్షులు కేఏ పాల్ ( K. A. Paul) నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి తనను ఎదుర్కోలేక తన సోదరుడి హత్యను తిరగదోడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Telangana), భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) పైన ప్రజా శాంతి పార్టీ (praja shanti party) అధ్యక్షులు కేఏ పాల్ ( K. A. Paul) నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి (Chief Minister) తనను ఎదుర్కోలేక తన సోదరుడి హత్యను తిరగదోడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలోని మహా నేతలే తన ముందు మోకరిల్లారని, అలాంటి తన ముందు ఇక కేసీఆర్ ఎంత అని మండిపడ్డారు. కేసీఆర్ (KCR) తనను చంపేస్తే స్వర్గానికి వెళ్తానని, కానీ కేసీఆర్ తన తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అవినీతికి, అక్రమాలకు కచ్చితంగా నరకానికి వెళ్తారన్నారు. తాను ప్రార్థిస్తే ఆయన సర్వనాశనం కావడం ఖాయమన్నారు. దైవ దూతల మీద చేయి వేస్తే దేవుడు క్షమించడన్నారు. తనకు అన్యాయం చేయాలని చూసిన వైయస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy), తన తమ్ముడు ఈ భూమి మీద లేకుండా పోయారన్నారు. కేసీఆర్ (KCR) దొర కాదని, దొంగ అని తాను న్యాయస్థానంలో రుజువు చేస్తానన్నారు. తన సోదరుడి హత్య కేసును తిరగదోడటం ద్వారా తనను ఏం చేయలేరని, హైకోర్టు (High Court), సుప్రీం కోర్టులను (Supreme Court) కేసీఆర్ (KCR) కొనలేరు కదా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ (KCR) కు తాను ఏడు రోజుల సమయం ఇస్తున్నానని, గవర్నమెంట్ (Government) ఫ్లీడర్ తనపై కేసును వచ్చే బుధవారం లోపు వెనక్కి తీసుకుంటారా లేదా అని నిలదీసారు. వచ్చే బుధవారం వరకు సమయం ఇస్తున్నానని, ఆ లోపు వెనక్కి తీసుకోకుంటే తాను కేసీఆర్ పైన రియల్ ఫైట్ చేస్తానన్నారు. అప్పుడు రూ.5 లక్షలు దోచుకున్న మీరు గెలుస్తారా లేక రూ.5 లక్షలు పంచిపెట్టిన తాను గెలుస్తానా చూద్దామన్నారు. తాను అధికారంలో లేకుంటేనే ప్రజల కోసం లక్షలు తెచ్చానని, అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు.
నీ పప్పులు ఉడకవ్
తెలంగాణ పోరాటం (Telangana agitation) సమయంలో తెలంగాణను బంగారం చేస్తానని చెప్పి, ఇప్పుడు మోసం చేస్తున్నారన్నారు. తెలంగాణ అమరవీరులకు, బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేశారన్నారు. చేతనైతే నీతిగా ఫైట్ చేయాలని, కానీ ఫాల్స్ కేసును తవ్వ కాదని కేసీఆర్ పైన మండిపడ్డారు. 2012లో కాంగ్రెస్ తన పైన అనేక అబద్దపు కేసులు పెట్టిందని, అందులో తన సోదరుడి హత్య కేసు అన్నారు. 2010లో తాను అమెరికాలో ఉన్నప్పుడు, తన అన్నయ్య చంపేశారని, ఆ సమయంలో తాను అంతిమయాత్రకు వచ్చానని, అప్పుడే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశానని చెప్పారు. ఎనిమిది మందిని నాటి ప్రభుత్వం అరెస్ట్ చేసిందన్నారు. కానీ 28 నెలల తర్వాత జగన్ (YS Jagan), కాంగ్రెస్ (Congress) తనపై ఫాల్స్ కేసు పెట్టారన్నారు. ఆ తర్వాత రెండేళ్లకు తనపై తప్పుడు కేసు పెట్టినట్లు కోర్టుకు పోలీసులు తెలిపారన్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి తనను ఎదుర్కోలేక అదే కేసును తెరపైకి తీసుకు వస్తున్నారన్నారు. అప్పుడు కాంగ్రెస్ తనపై కేసు పెడితే, మీరే విమర్శించారని, కేసును ఖండించారని, ఇప్పుడు ఆ కేసును తొలగించకుండా పైగా తనపై ప్రతీకారం తీర్చుకుంటారా అని నిలదీశారు. తెలంగాణ ప్రజలు ఎక్కువగా తనతో ఉన్నారని, తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, అందుకే కేసీఆర్ ఇలా చేస్తున్నారన్నారు. తనను అరెస్ట్ చేయాలని చూస్తే, నీ పప్పులు ఉడకవ్ అన్నారు.
పరుగెత్తడానికి నేను చంద్రబాబును కాదు
కోదండరాంను (Kodandaram), మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga), చంద్రబాబును (Chandrababu Naidu) కేసీఆర్ ఆటాడుకున్నారని, పరుగెత్తించారని, కానీ నేను కేఏ పాల్ ను, ప్రపంచాన్ని పరుగెత్తించాననే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. నా ముందు జార్జ్ బుష్షే (george bush) మోకరిల్లారని, అలాంటిది నువ్వెంత అన్నారు. వైయస్ కంటే గొప్పవాడివా నువ్వు.. నువ్వెంతయా అన్నారు. వినాశ కాలే విపరీత బుద్ది అన్నారు. కేసీఆర్ పైన ఇప్పటి వరకు తాను ఎలాంటి కేసు వేయలేదన్నారు. ఇక్కడి నుండి పరుగెత్తడానికి నేను చంద్రబాబును కాదన్నారు. ఇక్కడ ఉన్నది కేఏ పాల్ అని గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ గారు.. వినాశ కాలే విపరీత బుద్ధి అన్నారు. మీకు వినాశ కాలం వచ్చిందన్నారు. మీ పుట్టిన రోజు 17వ తేదీన దీవెనలు ఇస్తే, మీకు అలా వద్దా.. శాపాలు కావాలా అలా అయితే సిద్ధమన్నారు. మీ పప్పులు ఉండకవని, మీ బాప్ కూడా ఏం చేయలేరని హెచ్చరించారు. నీకు గట్స్ ఉంటే నాతో నేరుగా చర్చకు రావాలన్నారు. రూ.5 లక్షల కోట్లు ఎలా అప్పు చేశావ్, ఎలా దుర్వినియోగం చేసావ్, లక్ష కోట్ల రూపాయలను కాళేశ్వరం మీద ఎలా వేస్ట్ చేశావ్… చర్చిద్దాం రా అన్నారు. చేతనైతే, చిత్తశుద్ధితో తనతో గంట చర్చకు రావాలని సవాల్ చేశారు. కళ్లు నెత్తికి వచ్చాయా అన్నారు. నేను ప్రేయర్ చేస్తే ముక్కలు ముక్కలు అవుతారన్నారు. తనను టార్గెట్ చేసిన ఏడుగురికి ఏడుగురు ఇప్పుడు లేరన్నారు. చివరకు వైయస్, తన సోదరుడు కూడా మిగలలేదన్నారు.