»Indias Sensation In Womens Test Cricket A Record For The First Time After 88 Years
INDW vs ENGW : మహిళల టెస్టు క్రికెట్లో భారత్ సంచలనం..88 ఏళ్ల తర్వాత తొలిసారి రికార్డ్
టీమిండియా మహిళల జట్టు రికార్డు నెలకొల్పింది. 88 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచులో 410 పరుగులు చేసి సంచలనం సృష్టించింది. 1935లో ఇంగ్లాండ్ జట్టు 431 పరుగులతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇప్పుడు భారత మహిళల జట్టు చేరింది.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచులో భారత మహిళలు రికార్డు క్రియేట్ చేశారు. తొలి రోజు ఆటలో 400 లకు పైగా పరుగులు సాధించి ఔరా అనిపించారు. నలుగురు బ్యాటర్లు అర్ధశతకాలు సాధించడం విశేషం. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 410 రన్స్ చేయగలిగింది. దీప్తి శర్మ 60, పూజా వస్త్రాకర్ 4 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. మహిళల టెస్టు క్రికెట్లో గత 88 ఏళ్లలో మొదటి రోజే నాలుగు వందలకు పైగా పరుగులు చేసిన మొదటి జట్టుగా భారత్ చరిత్ర లిఖించింది. మొత్తంగా అయితే ఈ ఘనతను సాధించిన రెండో జట్టుగా భారత్ నిలవడం విశేషం.
1935లో క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ జట్టు నాలుగు వికెట్లు నష్టపోయి 431 పరుగులు చేసి రికార్డు నెలకొల్పింది. ఆ రికార్డును నేడు భారత్ బ్రేక్ చేసింది. ముంబై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో గురువారం జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 49, యస్తికా భాటియా 66 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్ 2 వికెట్లు తీయగా.. కేట్ క్రాస్, ఛార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ తలొక వికెట్‌ను పడగొట్టి తమ ఖాతాలో వేసుకున్నారు.