»Indian Actor Aman Dhaliwal Attacked At A Gym In Us Accused Held
Indian actor attacked in US: అమెరికాలో భారత నటుడిపై దాడి, రియల్ హీరో అనిపించాడు…
పంజాబీ నటుడు అమన్ ధలివాల్ పైన అమెరికాలో దాడి జరిగింది. ఓ వ్యక్తి అతని పైన కత్తితో దాడి చేస్తూ, అరుస్తుండగా అదును చూసిన అమన్... అతనిపై గట్టిగా పట్టుకొని, లొంగదీసుకున్నాడు. ఈ పంజాబీ నటుడికి గాయాలు అయ్యాయి.
పంజాబీ నటుడు అమన్ ధలివాల్ పైన అమెరికాలో (Indian Actor Aman Dhaliwal Attacked in US) దాడి జరిగింది. ఓ వ్యక్తి అతని పైన కత్తితో దాడి చేస్తూ, అరుస్తుండగా అదును చూసిన అమన్… అతనిపై గట్టిగా పట్టుకొని, లొంగదీసుకున్నాడు. ఈ పంజాబీ నటుడికి (Punjab actor Arman Dhaliwal) గాయాలు అయ్యాయి. కాలిఫోర్నియాలోని ప్లానెట్ ఫిట్ నెస్ జిమ్ లో (gym in California) గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. జిమ్ కు వెళ్లిన ధలివాల్ పైన గుర్తు తెలియని వ్యక్తి… నిందితుడు దాడికి దిగాడు. దీంతో అక్కడున్న వారు షాకయ్యారు. గాయాలపాలైన అతనిని హాస్పిటల్ కు తరలించారు. నటుడికి పలుచోట్ల కుట్లు పడ్డాయి. ఇవన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. నిందితుడు ఎందుకు దాడి చేశాడనే విషయం తెలియాల్సి ఉంది. శరీరమంతా కట్లతో ఉన్న ధలివాల్ (Arman Dhaliwal) చిత్రంతో పాటు ఇందుకు సంబంధించిన వీడియో (Video) నెట్టింట వైరల్ గా మారింది. అమన్ ధలివాల్ పంజాబ్ లోని మాన్సాలో జన్మించారు. పంజాబీ, హిందీ, తెలుగు చిత్రాల్లో నటించారు. జోదా అక్బర్ చిత్రంలో రాజ్ కుమార్ రతన్ సింగ్ పాత్రను పోషించారు. ఖలేజా, విస్రా, ఇక్ కుడి పంజాబ్ డి, జాట్ బాయ్స్ పూత్ జట్టన్ డి, అనంత్ ది ఎండ్ తదితర చిత్రాల్లో నటించారు.
ఈ దాడికి సంబంధించి 44 సెకన్ల వీడియోను ప్రముఖ పంజాబీ జర్నలిస్ట్ గగన్ దీప్ సింగ్ ట్విట్టర్ లో షేర్ చేసాడు. అందులో నటుడు అమన్ పైన కత్తితో దాడి చేసిన బ్లూహుడీలోని నిందితుడు గట్టిగా అరుస్తూ అందరినీ భయపెట్టాడు. ప్లీజ్.. నన్ను గౌరవించండి… నాకు నీళ్లు ఇవ్వండి, నాకు నీళ్లు కావాలి, నీళ్లు ఇవ్వండి అంటూ అరిచాడు. అప్పటికే నటుడి పైన కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత నీటిని అడుగుతూ… అతనిని బెదిరిస్తున్నాడు. మీరు నన్ను పట్టుకోవాలని చూస్తే… అని గట్టిగా అరుస్తూ నటుడి వైపు కత్తి చూపుతూ తీవ్రంగా బెదిరిస్తున్నాడు. ఆ నిందితుడు ఒకసారి వెనక్కి తిరిగి అందరినీ బెదిరించే ప్రయత్నం చేయగా, క్షణంలో అప్రమత్తమైన అమన్ ధలివాల్ అతనిని గట్టిగా పట్టేసుకున్నాడు. పెనుగులాటలో గాయాలయ్యాయి. జిమ్ లోని మిగతా వారు కూడా అక్కడకు వచ్చి నిందితుడిని గట్టిగా పట్టుకున్నారు. ఈ నటుడు రియల్ లైఫ్ లోను హీరోలా నిందితుడిని పట్టుకోవడం గమనార్హం.