ఉత్తరప్రదేశ్(uttarpradesh)లోని పిలిభిత్(pilibhit)లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్నంగా ఇవ్వాల్సిన రూ.10 లక్షలు ఇవ్వలేదని ఓ భర్త తనతో మూడు నెలలు కాపురం చేయలేదని భార్య ఆరోపించింది. రూ.5 లక్షలు ఇచ్చిన తర్వాతనే హనీమూన్ కోసం నైనిటాల్ వెళ్లారని..అక్కడ కూడా తన అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలను రహస్యంగా చిత్రీకరించి డబ్బులు డిమాండ్ చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఓ భర్త(husband) తన భార్య(wife)కు మూడు నెలలుగా దూరంగా ఉన్నాడు. అదేంటని తన అత్తింటి వారు ఆరా తీయగా..తనకు ఇవ్వాల్సిన రూ.10 లక్షలు ఇచ్చిన తర్వాతనే కాపురం చేస్తానని చెప్పాడు. దీంతో వారు మొదట రూ.5 లక్షలు అప్పగించారు. ఆ క్రమంలో తన భార్యతో కలిసి నైనిటాల్ హనీమూన్ వెళ్లారు. ఆ నేపథ్యంలో తనకు తెలియకుండానే అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీసి ఆమె భర్త డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నారని భార్య(wife) ఆరోపించింది. అంతేకాదు ఈ సంఘటనపై ఆందోళనకు గురైన భార్య పిలిభిత్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో అత్త, భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు(police) దర్యాప్తు చేస్తున్నారు.
నైనిటాల్(nainital)లో తన భర్త అభ్యంతరకరమైన ఫోటో తీసి దానితో తనను బ్లాక్ మెయిల్ చేశాడని మహిళ ఆరోపించింది. వరకట్నం కోసం ఆ వ్యక్తి తనను ఒత్తిడి చేస్తూనే ఉన్నాడని చెప్పింది. వరకట్నం డిమాండ్‌పై అతను, అతని తల్లి తనను మాటలతో దూషించారని ఆమె పేర్కొంది. అంతేకాదు పెళ్లయిన మూడు నెలల పాటు భర్త తనతో శృంగారం చేయలేదని చెప్పింది. ఆ తర్వాత అతని గురించి తన తల్లితో చెప్పగా.. ఏదైనా లైంగిక సమస్యలు ఉంటే చికిత్స చేయిస్తానని కూడా చెప్పామని వెల్లడించింది.
కానీ అతను 10 లక్షలు ఇస్తేనే కాపురం చేస్తానని చెప్పడంతో అమ్మాయి ఫ్యామిలీ మొదట రూ.5 లక్షలు అరెంజ్ చేశారు. ఆ తర్వాత మిగతావి ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ జంటకు ఫిబ్రవరి 6, 2023న బదౌన్‌లో వివాహం జరిగింది. మరోవైపు పెళ్లి కోసం మహిళ ఫ్యామిలీ దాదాపు రూ. 20 లక్షలు ఖర్చు చేసిందని సమాచారం. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని(uttarpradesh) పిలిభిత్(pilibhit)లో చోటుచేసుకుంది.