నెట్టింట ఓ పాకిస్తాన్ పౌరుడి వీడియో వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే... షెహబాజ్ ప్రభుత్వంపై విరుచుకు పడి, ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ (Pakistan)కు నాయకత్వం వహించి ఉంటే పౌరులు కనీసం సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేవారని ఓ పౌరుడు చెప్పాడు.
ప్రధాని నరేంద్ర మోడీ (pm narendra modi) తన పనితీరుతో కేవలం భారత్ లోనే (India) కాదు, అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టను సంపాదించుకుంటున్నారు. 2014 తర్వాత ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ నిలవగా, అలాగే బలమైన నాయకుల్లో మోడీ ముందుంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక మంది మన ప్రధాని వైపు మొగ్గు చూపుతున్నారు. వివిధ దేశాల్లో మోడీకి అభిమానులు ఉన్నారు. మన దాయాది పాకిస్తాన్ (Pakistan)లో కూడా కొంతమంది పౌరులు… మోడీ (Narendra Modi) కావాలని కోరుకుంటున్నారు. ఆఫ్గనిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లలోను మోడీకి మద్దతుగా పౌరులు మాట్లాడిన సందర్భాలు విన్నాం. ఇప్పుడు పాకిస్తాన్ యూట్యూబర్, మాజీ జర్నలిస్ట్ చేసిన ఓ వీడియోలో.. మాకు మోడీ కావాలని డిమాండ్ చేస్తున్నారు ఓ పౌరుడు. ఇప్పుడు ఈ వీడియో పాకిస్తాన్, భారత్ నెట్టింట వైరల్ అవుతోంది.
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో (recession) కూరుకుపోయింది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రజలు కొనుగోలు చేయలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పాక్ పౌరులు షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ప్రభుత్వంపై (Government) తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోని మిగతా దేశాల కంటే అత్యున్నతంగా ఎదుర్కొన్న… అదే సమయంలో ఆర్థిక పరిస్థితి అంతగా దిగజారనీయకుండా… అలాగే మూడేళ్లుగా 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యం వంటి అంశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు మోడీని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ యూట్యూబర్ సనా అమ్జద్ (Sana Amjad) ఇటీవల ఓ వీడియోను రూపొందించారు. ఇందులో షెహబాజ్ ప్రభుత్వంపై విరుచుకు పడి, ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ (Pakistan)కు నాయకత్వం వహించి ఉంటే పౌరులు కనీసం సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేవారని ఓ పౌరుడు చెప్పాడు. మోడీని తమకు ప్రధానిగా మార్చమని దేవుడిని కోరుకున్నారు.
వైరల్ గా మారిన ఈ వీడియోలో ఏముందంటే… ‘మీరు బతికి ఉండాలంటే పాకిస్తాన్ నుండి పారిపోండి.. భారత్ లో షెల్టర్ తీసుకొని బతుకీడ్చవచ్చునని’ అని పాకిస్తాన్ వీధుల్లో నినాదాలు వినిపించాయి. దీనిపై యూట్యూబర్ సనా అమ్జద్ అక్కడే ఉన్న ఓ వ్యక్తిని ప్రశ్నించారు. దానికి సదరు పౌరుడు మాట్లాడుతూ… పాకిస్తాన్ లో పుట్టకపోయినా బాగుండేదని వ్యాఖ్యానించాడు. అంతేకాదు, భారత్ నుండి పాక్ విడిపోకుంటే బాగుండేదన్నాడు. కలిసి ఉంటే అప్పుడు మన వద్ద కూడా కిలో టమాటా రూ.20, కిలో చికెన్ రూ.150, లీటర్ పెట్రోల్ పాకిస్తాన్ ధరలో రూ.50కి లభించేది అన్నారు. మోడీ చాలా గొప్పవాడు.. మన కంటే ఆయన ఎంతో గ్రేట్. భారత ప్రజలు అతనిని ఎంతో గౌరవిస్తారు.. అనుసరిస్తారు. మనకు నరేంద్ర మోడీ అనే వ్యక్తి ప్రధానిగా ఉండి ఉంటే… నవాజ్ షరీఫ్, బెనజీర్, ఇమ్రాన్ ఖాన్, ముషరాఫ్ లు అవసరం లేదన్నారు. మేమంతా మోడీ ప్రధాని అయితే బాగుండు అనుకుంటున్నామన్నారు.
నేను మోడీ పాలనలో ఉండేందుకు సిద్ధం..
నేను మోడీ పాలనలో ఉండేందుకు సిద్ధం. మోడీ చాలా గొప్ప వ్యక్తి. అతను చెడ్డవాడేమీ కాదు. భారతీయులు ఎన్నో ఇతర దేశాల కంటే తక్కువ ధరకే టమాటాలు, చికెన్ కొనుగోలు చేస్తున్నారు. మీరు మీ కుటుంబానికి ఏమీ తిండి పెట్టలేని పరిస్థితుల్లో దేశాన్ని వదిలి బతుకీడ్చేందుకు పారిపోండి అన్నాడు. నేను దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను.. మోడీ మాకు కావాలి… మోడీ మన దేశాన్ని పాలించాలి అన్నాడు. పాకిస్తాన్ నేతలు నిత్యం భారత్తో పోల్చుకోవద్దు.. ఎందుకంటే ఆ దేశంతో పోల్చుకునే సత్తా మనకు లేదు అని అభిప్రాయపడ్డాడు.