మేషరాశి వారు ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుంటారు. కొన్ని మానసికమైన ఆలోచనలతో ఇబ్బంది పడతారు. సోమరితనంతో ఉంటారు. పిల్లలను ప్రేమగా చూసుకుంటారు. వారిపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో ఏ మార్పు ఉండవు.
వృషభ రాశి
ఈ రాశివారి కుటుంబ పరిస్థితులు ఆహ్లదకరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధు, మిత్రుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో సహనం వహించాలి, తప్పదు.
మిథున రాశి
మిథునరాశి వారికి ఈ రోజు శుభకార్యానికి సంబంధించిన పనులు సులభంగా నెరవేరుతాయి. దూరపు బంధువులను కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
కర్కాటక రాశి
కర్కాటకరాశి వారు ఈ రోజు వ్యాపారంలో విశేషమైన లాభాలను ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
సింహ రాశి
ఈ రాశివారికి మానసిక ఆనందం కలుగుతుంది. గతంలో వాయిదా వేసిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని మొండి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
కన్య రాశి
కన్యరాశివారు విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు సఫలమౌతాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
తుల రాశి
తులరాశి వారి అనారోగ్య సమస్యలతో బాధపడుతారు. వృథా ప్రయాణాలు ఉంటాయి. నూతన వ్యక్తులను కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారు విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచింది.
ధనుస్సు రాశి
ధనుస్సురాశి వారు వృత్తి రీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళన కలుగుతుంది. స్త్రీలతో తగాదాలకు దూరంగా ఉంటే మంచింది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.
మకర రాశి
మకరరాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదురౌతాయి. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఆత్మీయుల సహాయసహకారాలకోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది.
కుంభ రాశి
ఈ రాశివారు వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోనూ కచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది.
మీన రాశి
మీన రాశివారు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా వహించడం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. నిర్వహించాలి అనుకున్న కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడుతాయి. కొత్తగా ఏదైనా శుభకార్యలు చేయాలనుకుంటే వాయిదా వేసుకోవడం మంచింది.