తెలుగు రాష్ట్రా(Telugu states)ల్లో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడుతున్నారు. ఏపీ(AP), తెలంగాణ(Telangana) నిప్పుల కొలిమిలా తయారైంది. రోజురోజుకూ పగటిపూట ఉష్ణోగ్రత(Temperature) పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఓ వైపు ఉక్కపోతలు, మరో వైపు వడగాల్పులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బ తగిలి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ(Heat Wave)కు 19 మంది మృతిచెందారు. తెలంగాణలో వడదెబ్బతో వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది మరణించారు. ఏపీలో 10 మంది వడదెబ్బకు ప్రాణాలు వదిలారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సగటున 43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.స
తెలంగాణలోని గద్వాలలో ఓ కారు, ఏపీలోని పాలకొల్లులో ఓ కారు అధిక ఉష్ణోగ్రత(Temperature)లకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రతకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇప్పటి వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో 19 మంది వడదెబ్బ(Heat Wave)కు ప్రాణాలు వదలడంతో ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. వడదెబ్బకు తగిన చర్యలు తీసుకోవాలని అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.