Harish Rao : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి తెలంగాణ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ వచ్చి తెలంగాణపై విషం గక్కే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలుగా మాట్లాడారని, ఆమె మాటల్లో నిజాయితీ లేదు, నిజం లేదని హరీశ్ రావు అన్నారు. నిర్మలా సీతారామన్ చెప్పిన దాంట్లో కొత్తగా ఏమీ లేదని, అన్నీ అబద్దపు మాటలేనని హరీశ్ రావు తేల్చిపారేశారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి తెలంగాణ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ వచ్చి తెలంగాణపై విషం గక్కే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలుగా మాట్లాడారని, ఆమె మాటల్లో నిజాయితీ లేదు, నిజం లేదని హరీశ్ రావు అన్నారు. నిర్మలా సీతారామన్ చెప్పిన దాంట్లో కొత్తగా ఏమీ లేదని, అన్నీ అబద్దపు మాటలేనని హరీశ్ రావు తేల్చిపారేశారు.
సీఎం కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీలో మాట్లాడింది నూటికి నూరు శాతం నిజమని హరీశ్ రావు అన్నారు. లెక్కలతో సహా సీఎం కేసీఆర్ మాట్లాడారని హరీశ్ రావు గుర్తుచేశారు. దేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను శాసన సభలో సీఎం కేసీఆర్ వివరించారని హరీశ్ రావు గుర్తుచేశారు. RBI, నీతి ఆయోగ్, కాగ్ లెక్కల ఆధారంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగించారని హరీశ్ రావు తెలిపారు. . వాస్తవాలను కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్టు కొడితే కేంద్ర మంత్రులకు కడుపు మంట అవుతుందని హరీశ్ రావు అన్నారు.